మిస్‌ యూ..డోంట్‌ వర్రీ ప్రెసిడెంట్‌..కమల హ్యారీస్‌, ట్రంప్‌ ట్వీట్స్‌ వార్‌

| Edited By: Srinu

Dec 04, 2019 | 5:26 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..భారత సంతతికి చెందిన సెనేటర్‌ కమల హ్యారిస్‌ మధ్య ట్వీట్ల వార్‌ నడుస్తోంది. కమల అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంపై స్పందించిన డొనాల్డ్‌‌..వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ఇది చాలా బాధ కలిగించే అంశం. మేము మిమ్మల్ని మిస్సవుతున్నామంటూ వెటకారంగా కామెంట్‌ చేశారు. వెంటనే ట్రంప్‌ ట్వీట్‌పై కౌంటర్ అటాక్‌ చేశారు కమల. మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు అధ్యక్షా. అభిశంసన విచారణలో కలుద్దామంటూ అంతే గట్టిగా చురకలంటించారు. డెమొక్రటిక్‌ అధ్యక్ష […]

మిస్‌ యూ..డోంట్‌ వర్రీ ప్రెసిడెంట్‌..కమల హ్యారీస్‌, ట్రంప్‌ ట్వీట్స్‌ వార్‌
Follow us on

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..భారత సంతతికి చెందిన సెనేటర్‌ కమల హ్యారిస్‌ మధ్య ట్వీట్ల వార్‌ నడుస్తోంది. కమల అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంపై స్పందించిన డొనాల్డ్‌‌..వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ఇది చాలా బాధ కలిగించే అంశం. మేము మిమ్మల్ని మిస్సవుతున్నామంటూ వెటకారంగా కామెంట్‌ చేశారు. వెంటనే ట్రంప్‌ ట్వీట్‌పై కౌంటర్ అటాక్‌ చేశారు కమల. మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు అధ్యక్షా. అభిశంసన విచారణలో కలుద్దామంటూ అంతే గట్టిగా చురకలంటించారు.

డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో నిలిచి..ఒకానొక దశలో ట్రంప్‌తో తలపడేది తనేనన్న భావన కలిగించారు కమల హ్యారీస్‌. జనవరిలో బాల్టిమోర్‌ నుంచి ఫర్‌ ద పీపుల్‌ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆమె..అధ్యక్షునిపై గట్టి విమర్శనాస్త్రాలు సంధించారు. ట్రంప్‌ అనుసరిస్తున్న విధానాలను వేలెత్తి చూపించారు. అయితే న్యూయార్క్‌ మేయర్‌ మైక్‌ బ్లూమ్‌ బర్గ్‌ రంగంలోకి దిగడం..హెల్త్‌కేర్‌ వంటి పథకాలను ఎలా ముందుకు తీసుకువెళ్తామన్న విషయాలపై స్పష్టతనివ్వకపోవడంతో తనకు మద్దతు కూడగట్టడంలో కమల వెనుకబడ్డారు. ఈ క్రమంలోపార్టీలోని ఇతర సభ్యులతో పోలిస్తే ఆమె 3.5 శాతం ఓట్లు మాత్రమే సంపాదించి ఆరో స్థానానికి పడిపోయారు. దీంతో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ఆమె వైదొలిగారు.