అమెరికాలో కరోనా తన ప్రతాపం చూపుతోంది. సగానికి పైగా రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ లో మరో ఇద్దరు ఈ వ్యాధికి గురై మరణించారు. దీంతో దేశంలో కరోనాకు గురై మృతి చెందిన వారి సంఖ్య 19 కి పెరగగా.. కేవలం న్యూయార్క్ లోనే 89 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారిన పడిన.. ప్రయాణికులతో కూడిన ఓ నౌక శాన్ ఫ్రాన్సిస్కో రేవులో నిలిచిపోయింది. దేశంలో కోవిడ్-19 కారణంగా ప్రజల దైనందిన జీవితం క్రమంగా స్తంభించిపోయేంత పరిస్థితి కనిపిస్తోంది. సభలు, సమావేశాలు, కాన్ఫరెన్సులు రద్దవుతున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు తమ ఇళ్లలోనే ఉండి ఆన్ లైన్ ద్వారా క్లాసులు తీసుకోవాలని వివిధ యూనివర్సిటీలు కోరుతున్నాయి. ఇప్పటికే ఫ్లోరిడాలో ఇద్దరు కరోనా బాధితులు మరణించిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ గవర్నర్ ఏండ్రు క్యూమ్ ఈ సిటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
శాన్ ఫ్రాన్సిస్కో రేవులో నిలిచిపోయిన నౌకలోని 46 మందిలో 19 మంది సిబ్బందికి, ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. వీరిని ఇతరులనుంచి వేరు చేసి ఐసొలేషన్ కి తరలిస్తున్నట్టు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు.
ట్రంప్ హాజరైన సభలో ఒకరికి కరోనా
‘కరోనానా ? మాకేం భయం ? ట్రంప్