సైంటిస్ట్‌పై కారు ఎక్కించిన సైకో.. ఆ తర్వాత అత్యాచారం.. హత్య..

| Edited By:

Jul 18, 2019 | 3:33 PM

గ్రీస్‌లోని క్వీటో ద్వీపంలో దారుణం జరగింది. కామంతో కళ్లు మూసుకుపోయి.. చెప్పడానికి కూడా మాటలు రాని విధంగా వికృతంగా ప్రవర్తించాడు ఓ సైకో. అమెరికాకు చెందిన ఓ మహిళా సైంటిస్ట్‌ను కారుతో తొక్కించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని ఆ నీచుడు.. ఆమెను అత్యంత దారుణంగా హతమర్చాడు. అమెరికాకు చెందిన 59 ఏళ్ల సుజానే ఈటన్.. మాక్స్ ప్లాంక్ ఇన్‌‌స్టిట్యూట్ డ్రెస్డెన్ యూనివర్సిటీలో.. మాలిక్యులర్ బయోలజిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె భర్త బ్రిటీష్ సైంటిస్ట్ అంథోనీ హైమన్. […]

సైంటిస్ట్‌పై కారు ఎక్కించిన సైకో.. ఆ తర్వాత అత్యాచారం.. హత్య..
Follow us on

గ్రీస్‌లోని క్వీటో ద్వీపంలో దారుణం జరగింది. కామంతో కళ్లు మూసుకుపోయి.. చెప్పడానికి కూడా మాటలు రాని విధంగా వికృతంగా ప్రవర్తించాడు ఓ సైకో. అమెరికాకు చెందిన ఓ మహిళా సైంటిస్ట్‌ను కారుతో తొక్కించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని ఆ నీచుడు.. ఆమెను అత్యంత దారుణంగా హతమర్చాడు.

అమెరికాకు చెందిన 59 ఏళ్ల సుజానే ఈటన్.. మాక్స్ ప్లాంక్ ఇన్‌‌స్టిట్యూట్ డ్రెస్డెన్ యూనివర్సిటీలో.. మాలిక్యులర్ బయోలజిస్టుగా పనిచేస్తున్నారు. ఆమె భర్త బ్రిటీష్ సైంటిస్ట్ అంథోనీ హైమన్. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. అయితే ఓ కాన్ఫరెన్స‌లో పాల్గొనేందుకు స్నేహితులతో కలిసి గ్రీన్ క్వీట్ ద్వీపంలోని చనియా నగరానికి వెళ్లిన ఆమె.. అక్కడ దారుణ హత్యకు గురయ్యారు. కాన్ఫరెన్స్‌లో భాగంగా జూలై 2న బయటికి వెళ్లిన సుజానే కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళనకు గురైన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈటన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు స్థానిక పోలీసులు. వారం రోజుల తర్వాత నగర శివారులోని రెండో ప్రపంచ యుద్ధం నాటి ఓ బంకర్‌లో మహిళ మృతదేహముందంటూ స్థానికులు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ డెడ్‌బాడీ సుజానేదిగా గుర్తించారు.

ఆ బంకర్‌లో లభించిన ఆధారాలతో దర్యాప్తు చేసి పోలీసులు.. క్వీట్ ద్వీపంలోని ఓ అనుమానితుణ్ణి అరెస్ట్ చేసి వివరించారు. దర్యాప్తులో తానే హతమార్చినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఒంటరిగా వెళ్తున్న ఈటన్‌ను కారులో ఎక్కించుకొని శివారులోని ఆర్మీ బంకర్‌కు తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి జరిపి అనంతరం హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.