కరోనా పాండమిక్ ! న్యూయార్క్ లో రోడ్లమీదే రెస్టారెంట్లు !

కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్ లో అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఔట్ డోర్ రెస్టారెంట్లకు అనుమతినిస్తున్నట్టు వారు  ప్రకటించారు. అంటే ఇక రోడ్లమీదే హోటళ్లు వెలిశాయన్నమాట ..!

కరోనా పాండమిక్ ! న్యూయార్క్ లో రోడ్లమీదే రెస్టారెంట్లు !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 26, 2020 | 2:58 PM

కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్ లో అధికారులు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఔట్ డోర్ రెస్టారెంట్లకు అనుమతినిస్తున్నట్టు వారు  ప్రకటించారు. అంటే ఇక రోడ్లమీదే హోటళ్లు వెలిశాయన్నమాట !.ఇలా చేసి తాము సుమారు లక్షమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకకుండా చూడగలిగామని మేయర్ బిల్ డీ బ్లాసియా తెలిపారు. గత జూన్ లో ఈ సరికొత్త ప్రయోగాన్ని ప్రారంభించినప్పటి నుంచి నగరవాసుల్లో ఇది పాపులర్ అయిందన్నారు. ఓపెన్ రెస్టారెంట్ అన్నది సాహసోపేత నిర్ణయమని, అయితే ఇది తాత్కాలికమేనని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం బాగా వర్కౌట్ అయింది. చాలామంది సరదాగా రోడ్ సైడ్ హోటళ్లలో కూర్చుని ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు అని బిల్ డీ వెల్లడించారు.

Latest Articles