US: అమెరికాలో దుండగుడి వీరంగం.. మహిళా ఉగ్రవాది విడుదల కోసం ఏం చేశాడంటే..

|

Jan 16, 2022 | 4:36 PM

Armed Man Sought Pak Terrorist's Release: అమెరికాలో గన్‌కల్చర్ రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. తాజాగా.. పేలుడు పదార్థాలు ఉన్న ఓ దుండగుడు

US: అమెరికాలో దుండగుడి వీరంగం.. మహిళా ఉగ్రవాది విడుదల కోసం ఏం చేశాడంటే..
Us
Follow us on

Armed Man Sought Pak Terrorist’s Release: అమెరికాలో గన్‌కల్చర్ రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. తాజాగా.. పేలుడు పదార్థాలు ఉన్న ఓ దుండగుడు అమెరికాను గడగడలాడించాడు. నలుగురు వ్యక్తులను బందీలుగా చేసుకొని దాదాపు పది గంటల పాటు వీరంగం సృష్టించాడు. ప్రత్యేక దళాలు దుండగుడిని హతమార్చడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయం ఓ దుండగుడు టెక్సాస్‌లోని యూదుల ప్రార్థనా మందిరం ‘సినగాగ్‌’ లో మతగురువు సహా నలుగురు వ్యక్తుల్ని బందీలుగా చేసుకున్నాడు. తర్వాత ఓ వీడియోను బయటకు వదిలాడు. అమెరికా జైల్లో ఉన్న ఓ పాకిస్థాన్‌ మహిళా ఉగ్రవాది ఆఫియా సిద్ధిఖీని వదిలిపెట్టాలని డిమాండ్‌ చేశాడు. ఎఫ్‌బీఐ సహా స్వాట్‌ టీం.. కోలీవిల్‌ పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించి దుండగుడితో మాట్లాడి బందీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

అయితే.. ఘటనపై స్వయంగా అధ్యక్షుడు బైడెన్‌ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కాగా.. ఆఫియా సిద్ధికీకి 86 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఓ అమెరికా కోర్టు. ఉగ్రవాద కలాపాలకు, అమెరికా సైనికులపై హత్యాయత్నం కేసులో ఆమె నిందితురాలు. కోలీవిల్‌కు సమీపంలో ఉన్న ఫోర్ట్‌ వర్త్‌ జైలులో ఆమె ప్రస్తుతం శిక్ష అనుభవిస్తోంది.

పాకిస్థాన్‌కు చెందిన సిద్ధిఖీ ఓ న్యూరోసైంటిస్ట్‌. ఈమె అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఎంఐటీలో విద్యనభ్యసించింది. 9/11 దాడుల తర్వాత అమెరికా బలగాలకు ఈమె కదలికలపై అనుమానం వచ్చింది. 2004లో ఆమెను అల్‌ఖైదా ఉగ్రవాదిగా ప్రకటించి చివరకు 2008లో అమెరికా బలగాలు సిద్ధిఖీని అఫ్గానిస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నాయి.

 

Also Read:

NRI: విదేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారా.? మీ బ్యాంక్ ఖాతాను మార్చుకోవాల్సిందే.. ఈ విషయాలు తెలుసుకోండి!

Omicron Variant: ఒమిక్రాన్ తో మరిన్ని కొత్త వెరియంట్స్.. నిపుణుల హెచ్చరిక ఇదీ..పూర్తి వివరాలు..