తాలిబన్ పొలిటికల్ చీఫ్‌ తో నా చర్చలు సంతృప్తికరం.. ట్రంప్

| Edited By: Anil kumar poka

Mar 04, 2020 | 12:40 PM

ఆఫ్ఘన్ శాంతి ప్రక్రియపై తాలిబన్ పొలిటికల్ చీఫ్ ముల్లా బరాదర్ తో తాను జరిపిన చర్చలు తనకెంతో సంతృప్తినిచ్చాయని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ తాలిబన్ ఫైటర్ కూడా అయిన బరాదర్..

తాలిబన్ పొలిటికల్ చీఫ్‌ తో నా చర్చలు సంతృప్తికరం.. ట్రంప్
Follow us on

ఆఫ్ఘన్ శాంతి ప్రక్రియపై తాలిబన్ పొలిటికల్ చీఫ్ ముల్లా బరాదర్ తో తాను జరిపిన చర్చలు తనకెంతో సంతృప్తినిచ్చాయని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మాజీ తాలిబన్ ఫైటర్ కూడా అయిన బరాదర్..తో ఆయన సుమారు 35 నిముషాల పాటు ఫోన్ లో సంభాషించినట్టు తాలిబన్లు కూడా ప్రకటించడం విశేషం. కాగా-వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. వాళ్ళు (తాలిబన్లు) ఇక హింసకు స్వస్తి చెబుతారని ఆశిస్తున్నానని.. ఆలాగే కాల్పుల విరమణను పాటిస్తారని కూడా భావిస్తున్నానని చెప్పారు. బరాదర్ మాటలను బట్టి చూస్తే.. తాలిబన్లకు ఆయన మార్గనిర్దేశనం చేసినట్టే కనిపించిందన్నారు. అయితే గత శనివారం అమెరికాకు, తాలిబన్ ప్రతినిధులకు మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ .. ఒక రోజు ‘శాంతి’ మాత్రమే కనిపించింది. ఆఫ్ఘనిస్తాన్ లోని 34 రాష్ట్రాలకు గాను 16రాష్ట్రాల్లో సోమవారం నుంచి తాలిబన్లు 33 దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు ఆఫ్ఘన్ సైనికులు, ఆరుగురు పౌరులు మరణించారని, 14 మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నస్రత్ రహీమీ తెలిపారు. దీంతో ఈ నెల 10 నుంచి కాబూల్ లో తాలిబన్లకు, అమెరికా మద్దతు ఉన్న ప్రభుత్వానికి మధ్య జరగవలసిన చారిత్రాత్మక చర్చలపై సందేహాల నీలినీడలు పరచుకున్నాయి. అసలు అమెరికాపై తామే విజయం సాధించామని తాలిబన్లు బాహాటంగా ప్రకటించుకుంటున్నారు.