Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 8 లక్షల 78 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 878254. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 301609. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 553471. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23174. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు . ఈరోజు, రేపు ఆదిలాబాద్, నిర్మల్ , కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు ,ఖమ్మం జిల్లాలలో భారీవర్షాలు . తెలంగాణలో సాధారణం గా చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. మరోవైపు ఒరిస్సా నుండి కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి . - రాజారావు, హైదరాబాద్ వాతావరణ శాఖ.
  • తెలంగాణ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లకు ఆన్లైన్ లో శిక్షణ తరగతులు. రేపటి నుంచి 15 రోజుల పాటు 'డిజిటల్ దిశా' పేరుతో క్లాస్ ల నిర్వహణ. 5300 మంది లెక్చరర్లను 12 బ్యాచ్ లుగా చేసి ఆన్లైన్ విద్యాబోధన, డిజిటల్ తరగతులపై శిక్షణా కార్యక్రమం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ శిక్షణ.
  • ఉద్యోగం పేరుతొ మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు. రైల్వే శాఖలో ఉద్యోగం ఇపిస్తానంటూ అక్కా తమ్ముడి నుంచి 25లక్షల రూపాయల దాకా వసూలు చేసిన నిందితులు. ఉద్యోగాలు ఇపిస్తామంటే నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.
  • హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ ప్రభుత్వానికి లేఖలు. సీఎం జగన్ తో పాటు, లేఖ సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కి లేఖల హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని వినతి. హిందూపురం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని తెలిపిన బాలకృష్ణ. కర్ణాటక రాజధాని బెంగళూరు కి దగ్గరగా ఉండటంతో పాటు అనువైన స్థలం కూడా ఎక్కువగా ఉందని తెలిపిన బాలకృష్ణ.
  • అమరావతి : మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కొడుకు సురేష్ మాజీ పీఎస్ మురళీమోహన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్ విచారణ. బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు. ఇప్పటికే పరారీలో ఉన్న పితానీ కొడుకు వెంకట సురేష్ వెంకట సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ అధికారులు. బెయిల్ ఇవ్వొద్దని కోర్టు కోరిన ఏసీబీ అధికారులు.
  • కర్ణాటక ఆరోగ్య శాఖ సర్క్యులర్ జారీ. కరోనా పరీక్షలు చేయించుకున్నవారు... వారి ఫలితాలు ప్రకటించే వరకు కఠినంగా హోమ్ క్వారంటైన్ అవ్వాలని కర్ణాటక ఆరోగ్య శాఖ సర్క్యులర్ జారీ.

‘లక్ష్మీ బాంబ్’ ఎలా ఉంటుందో చెప్పిన అక్షయ్..

Akshay, ‘లక్ష్మీ బాంబ్’ ఎలా ఉంటుందో చెప్పిన అక్షయ్..

Laxmmi Bomb : కరోనా ప్రభావంతో చిత్రపరిశ్రమ మొత్తం లాక్ డౌన్ లోనే ఉండిపోయింది. షూటింగ్ లు నిలిచిపోవడం… కొత్త సినిమాలు విడుదల వాయిదాలు పడటంతో ఇండస్ట్రీ మరో మార్గాన్ని వెతుకుంటోంది. ఇప్పుడు తాజాగా..
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హర్రర్ కామెడీ ఫిల్మ్ ‘లక్ష్మీ బాంబ్’ ఇప్పుడు ఓటీటీలో విడుదల అవుతుంది. వాస్తవానికి ఈ చిత్రం మే 22నే విడుదల కావాల్సింది. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రానికి చెందిన రెండు పోస్టర్స్ ను విడుదల చేశారు.

పోస్టర్స్ విడుదల సందర్భంగా అక్షయ్ మాట్లాడారు… లక్ష్మీ బాంబ్‌లో మానసికంగా ఉద్వేగభరితమైన పాత్ర నాది. ఇటువంటి పాత్ర నేను ఇంతకు ముందెన్నడూ చేయలేదు. నిజంగా చెప్పాలంటే కరెక్ట్ సీన్ కోసం నేను చాలా రీటేక్‌లు తీసుకున్నది కూడా ఇందులోనే… ఈ చిత్రంలో దర్శకుడు రాఘవ లారెన్స్ నాకు కొత్తదనాన్ని అనుభవించే అవకాశాన్ని కల్పించారు.

ఇందులో ట్రాన్స్‌జెండర్ పాత్రను నాతో చేయించిన ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పటి వరకు నాకు తెలియని ఒక సంస్కరణకు నన్ను రాఘవ పరిచయం చేశాడు. ఈ చిత్రం మనుషుల్లో విభేదాలపై మరింత అవగాహనను నాకు నేర్పింది. మీకు కావాల్సిన దాని కోసం.. అజ్ఞానంగా, మూర్ఖంగా పొందాలని ప్రయత్నించవద్దు. దయ.. శాంతికి కీలకం అని తెలుసుకోండి” అని వివరించారు.

Related Tags