మహారాష్ట్రలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. క్రమంగా కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది.

  • Balaraju Goud
  • Publish Date - 9:27 pm, Mon, 26 October 20

దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. క్రమంగా కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. నిత్యం వేలాది కేసులు నమోదైన రాష్ట్రాల్లో మెల్లమెల్గగా పాజిటివ్ కేసుల సంఖ్య దిగువకు చేరుకుంటుంది. తాజాగా మహారాష్ట్రలో రెండు మూడు రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,645 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక ఇవాళ ఒక్క రోజు 84 మంది కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయినట్లు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొన్నారు. దీంతో మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,48,665కు చేరుకుంది. ఇక ఇప్పటివరకు మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 43,348కు చేరింది. మరోవైపు, గత 24 గంటల్లో 9,905 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 14,70,660కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,34,137 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.