మోదీపై తలైవా మళ్లీ ప్రశంసలు

Rajni kanth Praises

సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై మళ్లీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్టికల్ 370 రద్దు ఓ మాస్టర్ స్ట్రాటజీ అంటూ అభివర్ణించారు. మొత్తం వ్యవహారం పక్కా ప్లానింగ్ ప్రకారం అమలు చేసి.. సక్సెస్ అయ్యారని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ముందస్తు చర్యలు తీసుకుని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరించారన్నారు. తొలుత రాష్ట్రంలో భారీగా బలగాలను మొహరించి.. ఎలాంటి ఘర్షణలు జరగకుండా చర్యలు చేపట్టారన్నారు. 144 సెక్షన్‌ను విధించి.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించారని సూపర్ స్టార్ ప్రశంసించారు. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా, మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టి, తర్వాత లోక్‌సభలో పాసయ్యేట్టు చేశారన్నారు. ఏది రాజకీయం చేయాలో.. ఏ అంశాన్ని రాజకీయం చేయకూడదో అన్న స్పృహ ప్రతీ రాజకీయ నాయకుడికీ ఉండాలని సూపర్‌స్టార్ ఉద్బోధించారు. కాగా, రెండ్రోజుల క్రితం కూడా మోదీ,షా ద్వయంపై సూపర్ స్టార్ ప్రశంసల జల్లు కురిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *