“దేశాలు దాటిన అవినీతి .. ఉగాండాలో బ్యాంక్ అకౌంట్” షాక్ తిన్న ఏసీబీ అధికారులు

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న అభియోగం పై కర్నూలు కు చెందిన అక్కిరాజు శివప్రసాద్‌ అనే మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ ఇంటి పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.శివప్రసాద్‌ పంచలింగాల చెక్‌పోస్టులో మోటర్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.ఆయన నివాసం ఉంటున్న కర్నూలుతో పాటు బెంగళూర్ ప్రాంతాల్లో రెండు చోట్లా‌, తాడ్రిపత్రి, హైదరాబాద్‌లోని తన మరో నివాసంలో మొత్తం ఐదు చోట్లా ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లో 1.45 లక్షల నగదు, కిలో […]

దేశాలు దాటిన అవినీతి ..  ఉగాండాలో బ్యాంక్ అకౌంట్ షాక్ తిన్న ఏసీబీ అధికారులు
Follow us

| Edited By:

Updated on: Oct 04, 2019 | 1:52 PM

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న అభియోగం పై కర్నూలు కు చెందిన అక్కిరాజు శివప్రసాద్‌ అనే మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ ఇంటి పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.శివప్రసాద్‌ పంచలింగాల చెక్‌పోస్టులో మోటర్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.ఆయన నివాసం ఉంటున్న కర్నూలుతో పాటు బెంగళూర్ ప్రాంతాల్లో రెండు చోట్లా‌, తాడ్రిపత్రి, హైదరాబాద్‌లోని తన మరో నివాసంలో మొత్తం ఐదు చోట్లా ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఇంట్లో 1.45 లక్షల నగదు, కిలో బంగారం.. అలాగే బెంగళూరులో సుమారు 3 కోట్లు విలువ చేసే జీప్లస్‌7 అపార్టమెంట్‌, హైదరాబాద్‌లో 1.5 కోట్లు విలువ చేసే అపార్టమెంట్‌, బెంగళూరులోనే 2 కోట్లు విలువ చేసే మరో బిల్డిండ్‌, హైదరాబాద్‌లోని గాజుల మల్లారంలో ఒక కోటి విలువ చేసే ఇంటి స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.ఇవికాక తన భార్య పేరుతో మరో రెండు ఆక్సి ట్రీ హోటల్‌ ప్రైవేట్ కంపెనీ, సీండ్రీస్‌ అనే రెండు సూట్ కంపెనీలు ఉన్నాయి. మనీ ట్రాన్సెక్షన్‌ కొసం ఈ కంపెనీ లను వాడుతున్నారు. హైదరాబాద్‌ లో లాకర్‌, ఉగాండాలో బ్యాంక్‌ అకౌంట్‌ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శివప్రసాద్‌కు మొత్తం 11 బ్యాంక్ అకౌంట్లు ఉండగా వీటిలో ఇది బయటపడిందని,దీనిలో నగదు లావాదేవీలు జరిగాయా లేదా అనే వివరాలు తెలుసుకుంటున్నామన్నారు అధికారులు. ఇంకా సోదాలు కొనసాగిస్తున్నామని ఏసీబీ డీఎస్వీ ఎం.నాగభూషణం తెలిపారు.