మోదీ పిలుపు.. తయారైన 6,940 యాప్‌లు

భారతీయ యువతకు ఈ నెల 4న ఆత్మ నిర్భర భారత్‌ యాప్ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ను ప్రధాని మోదీ విసిరిన విషయం తెలిసిందే.

మోదీ పిలుపు.. తయారైన 6,940 యాప్‌లు
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 2:25 PM

భారతీయ యువతకు ఈ నెల 4న ఆత్మ నిర్భర భారత్‌ యాప్ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ను ప్రధాని మోదీ విసిరిన విషయం తెలిసిందే. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా యాప్‌లను డెవలప్ చేయాలని, ప్రపంచ స్థాయి యాప్‌లకు అవి ధీటుగా ఉండాలని ఆయన అన్నారు. అంతేకాదు అత్యుత్తమ యాప్‌లకు రూ.2లక్షల నుంచి రూ.20 లక్షల వరకు భారీ నగదు బహుమతులు ఔత్సాహికులు పొందొచ్చని ఆయన అన్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఏకంగా 6940 యాప్‌లు తయారయ్యాయి.

ఇవన్నీ ఆత్మనిర్భర్ కింద రిజిస్టర్ అయ్యాయని నీతి అయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్‌ వెల్లడించారు. ఇందులో 3939 యాప్‌లు వ్యక్తిగతంగా పంపారని.. 3,001 యాప్‌లను ఆర్గనైజేషన్‌ మరియు కంపెనీలు పంపారని తెలిపారు. ఇక వ్యక్తిగతంగా పంపిన యాప్‌లో 1757 అప్లికేషన్లు వాడేందుకు సిద్ధంగా ఉన్నాయని.. 2182 ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఆర్గనైజేషన్లు/కంపెనీ పంపిన యాప్‌లలో 1742 వాడేందుకు సిద్ధంగా ఉండగా.. 1259 అభివృద్ధిలో ఉన్నాయని వివరించారు.

Read This Story Also: హైదరాబాద్‌లో కంటైన్మెంట్‌ జోన్లు ఎన్నంటే

Latest Articles