“మహా” పోలీసులపై కరోనా పంజా

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు  నమోదవుతున్నాయి. ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన..

మహా పోలీసులపై కరోనా పంజా
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2020 | 6:18 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు  నమోదవుతున్నాయి. ఇప్పటికే నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి మొదలు.. ప్రజా ప్రతినిధుల వరకు అంతా కరోనా బారినపడుతున్నారు. మహరాష్ట్రలో ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. గడిచిన 24 గంటల్లో 121 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ వచ్చిన పోలీస్ సిబ్బంది సంఖ్య 9 వేలకు చేరింది. వీరిలో కరోనా నుంచి కోలుకుని 7,176 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,939 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 102 మంది మరణించారు.

Read More 

కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు

కల్తీ మద్యం కాటుకు నలుగురు మృతి

ఆఫ్ఘన్‌లో కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి

Latest Articles