రాయుడి నిర్ణయం నన్నెంతో బాధించింది: యువరాజ్

Yuvraj, రాయుడి నిర్ణయం నన్నెంతో బాధించింది: యువరాజ్

వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమిపై మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ తొలిసారి స్పందించాడు. నాలుగో నంబర్‌ ఆటగాడి విషయంలో జట్టు యాజమాన్య వైఖరిని ప్రశ్నించాడు. ఒక ఆటగాడు ఆ స్థానంలో విఫలమౌతుంటే యాజమాన్యం అతడికి భరోసా ఇవ్వాలని అన్నాడు. ప్రపంచకప్‌ జట్టులో అవకాశమిస్తామనే నమ్మకాన్ని కలిగిస్తే అతడికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పాడు. 2003 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు టీమిండియా న్యూజిలాండ్‌తో ఆడినప్పుడూ ఇదే సమస్య ఎదురైందని గుర్తుచేశాడు. అప్పుడు జట్టు యాజమాన్యం ఇలాగే చెప్పిందని అదే జట్టుతో ఆ ప్రపంచకప్‌లో ఆడామని యువీ పేర్కొన్నాడు.

అలాగే అంబటిరాయుడి పట్ల యాజమాన్యం ప్రవర్తించిన తీరు బాధ కలిగించిందని తెలిపాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో రాయుడు బాగా ఆడినా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆడలేకపోయాడని గుర్తుచేశాడు. ఈ నేపథ్యంలో అతడికి బదులు రిషభ్‌పంత్‌కు అవకాశమిచ్చారని, ఆపై అతడిని కూడా పక్కకుపెట్టారని చెప్పాడు. నాలుగో నంబర్‌లో కీలకమైన ఆటగాడు అవసరమైతే ఒకర్ని కాదని మరొకరికి చోటివ్వడం సరైన పద్ధతి కాదని యువీ చెప్పుకొచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *