Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 73 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 173763. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86422. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 82370. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4971. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా సంక్షోభం భారత్‌పై పడకుండా అనేక చర్యలు చేపట్టాం. ఏ చిన్న సమస్య వచ్చినా ప్రపంచదేశాల సహాయం అర్థించే వాతావరణం ఉండేది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన సమయంలో మిగతా ప్రపంచానికి సహాయం చేసే పరిస్థితిలో ఉన్నాం. 54 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి ఔషధాలను అందిస్తున్నాం. కొన్ని పేద దేశాలకు ఉచితంగా ఔషధాలను అందజేస్తున్నాం. అమెరికా వంటి దేశం కూడా భారత్ వైపు చూసే పరిస్థితి ఉంది. నరేంద్ర మోదీ సర్కారు ఈ ఏడాది కాలంలో ఓ దిక్సూచిలా పనిచేసింది. కిషన్ రెడ్డి, హోం సహాయ మంత్రి.
  • వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం. ఆరోగ్యం క్షీణించడంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది . నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలింపు . ముంబై వెళ్లేందుకు వరవరావ్ కుటుంబ సబ్యులకు అనుమతి ఇచ్చిన హైద్రాబాద్ పోలీసులు.
  • కరోనా పేషంట్స్ కోసం రోబోట్ రూపకల్పన. కరోనా రోగులకు మెడిషన్, ఆహారాన్ని అందించడం కోసం ఔరంగాబాద్‌లో రోబోట్ రూపకల్పన. మహారాష్ట్ర లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి సాయి సురేష్ రూపొందించాడు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • తెలంగాణ రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు.. తెలంగాణ లో ఇవాళ 169 కరోనా పాజిటివ్ కేసులు.. తెలంగాణ కి చెందిన వారిలో 100 కరోనా పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలు మరియు సౌదీ నుంచి వచ్చిన వాళ్లలో 69.

సంతలో.. లక్షల్లో అమ్మాయిల బేరం..!! నారాయణ ఖేడ్‌లో ఏం జరుగుతుంది..?

Young girls sold for Rs.1 lakh in Sangareddy district, సంతలో.. లక్షల్లో అమ్మాయిల బేరం..!! నారాయణ ఖేడ్‌లో ఏం జరుగుతుంది..?

18 ఏళ్లు దాటిన ప్రతీ అమ్మాయి అదృశ్యం. రాత్రికి రాత్రే కుటుంబం మొత్తం మాయం. ఎవ్వరూ ఊహించని అనాగరికం. అవును.. గిరిజన తండాల్లో జరుగుతన్న అమానుష దందా.. తాజాగా.. వెలుగులోకి వచ్చింది. సంతలో పశువులను అమ్మినట్టుగా.. అక్కడ అమ్మాయిలను అమ్మేస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా.. కాసులకు కక్కుర్తి పడి.. మానవ విలువలను మట్టి కలుపుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జల్లా.. నారాయణ ఖేడ్‌లో.. అమాయక గిరిజన యువతుల్ని అమ్మకానికి పెడుతున్నారు. నాలుగేళ్లుగా ఈ అమానుష దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. అమాయక అమ్మాయిల్ని.. పెళ్లి పేరుతో మోసం చేసి.. వారి జీవితాల్ని నాశనం చేస్తున్నారు. డబ్బుల కోసం అమ్మాయిల్ని రాజస్థాన్‌కు చెందిన దళారులకు అమ్మేస్తున్నారు. అయితే.. ఈ దందా వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందంటున్నారు స్థానికులు.

డబ్బులకు ఆశపడి.. గిరిజన కుటుంబాలు కూడా.. వాళ్ల అమ్మాయిల్ని అమ్ముతున్నారు. ఒక్కో అమ్మాయిని.. దాదాపు రూ.15 లక్షలకు అమ్మేస్తున్నారు. వ్యాపారం పేరుతో.. రాజస్థాన్ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు.. నారాయణ ఖేడ్‌లో నివాసం ఏర్పరుచుకుంటున్నారు. మెల్లగా స్థానింగా ఉన్న వారితో పరిచయాలు పెంచుకుని.. ఈ అమ్మాయిల వ్యాపారం కూడా.. గుట్టు చప్పుడు కాకుండా.. నడుపుతున్నారు.

Related Tags