US Elections: అమెరికా ఎన్నికలు మంగళవారం రోజే ఎందుకు జరుగుతాయి?

|

Oct 24, 2024 | 11:22 AM

నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. ఇందులో ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే, అమెరికాలో ఎన్నికలు ఎప్పుడూ నవంబర్ మొదటి మంగళవారం నాడే జరుగుతాయి. 170 ఏళ్లుగా ఈ ఆచారమే కొనసాగుతోంది. ఎందుకు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మంగళవారం రోజునే నిర్వహిస్తారో తెలుసా?

US Elections: అమెరికా ఎన్నికలు మంగళవారం రోజే ఎందుకు జరుగుతాయి?
Us Elections
Follow us on

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు నవంబర్ 5న ఓటింగ్ జరగనుంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నెలకొంది. కమలా హారిస్ గెలిస్తే తొలిసారి అధ్యక్షురాలిగా, ట్రంప్ గెలిస్తే రెండోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికా రాజకీయాలలోని ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన ఘర్షణపై యావత్ ప్రపంచం దృష్టి ఉంది. అదే సమయంలో అమెరికా ఎన్నికలకు సంబంధించిన పలు ఆసక్తికర ఆచారం ఒక్కటి ఉంది. అమెరికాలో నవంబర్ మొదటి మంగళవారం రోజునే ఎన్నికలు జరుగుతాయి. ఇది 170 ఏళ్లుగా ఆచారంగా కొనసాగిస్తూ వస్తుంది.

2024లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న, అదే విధంగా 2028లో నవంబర్ 7న (మంగళవారం) ఓటింగ్, 2032లో నవంబర్ 2న (మంగళవారం) ఓటింగ్ జరగనుంది. అమెరికాలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. జనవరి 23, 1845న US కాంగ్రెస్‌లో ఒక చట్టం ఆమోదించబడింది. ఇది US ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలను నిర్వహించడానికి సమాన సమయం గురించి ప్రస్తావించారు. నవంబర్‌లో మొదటి మంగళవారం నాడు ప్రతి రాష్ట్రంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను నియమించాలని చట్టం పేర్కొంది. ముందస్తు ఎన్నికలను నిర్వహించిన రాష్ట్రాలు ఆ తర్వాత ఓటు వేసిన రాష్ట్రాల్లో అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయని ఓ రోజును ఎంచుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి