బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ స్టార్ట్ కానుంది. యూకే ప్రధాని పదవి కోసం నేడు ఓటింగ్ జరగబోతుంది. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి ప్రస్తుత ప్రధాని రిషి సునాక్, ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. బ్రిటన్, ఇంగ్లండ్, నార్తర్న్ ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్‌లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
మొత్తం 650 పార్లమెంట్ స్థానాలకు బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరగనుంది. ఆ దేశ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. ఓటు వేయటానికి ఓటర్ ఐడీ చూపించాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు. ఇమ్మిగ్రేషన్ ఉన్న వారికి కూడా ఈసారి ఓటు హక్కు కల్పించారు. 18 లక్షల మంది భారతీయులు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ఉంటుంది. రేపు సాయంత్రానికి ఏ పార్టీ గెలిచిందనేది అధికారికంగా ప్రకటిస్తారు.
యునైటెడ్ కింగ్ డమ్‌లో మొత్తం 392 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. కన్జర్వేటివ్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ ప్రధానమంత్రిగా ఉన్నారు. లేబర్ పార్టీ 15 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉంది. ఈ పార్టీ నుంచి కీర్ స్టార్మర్ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రచారం చేశారు. గెలుపుపై ఎవరి ధీమా వారికే ఉన్నా..లేబర్ పార్టీ బలంగా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..