
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు..టెక్ దిగ్గజం బిల్ గేట్స్ చెఫ్‌గా మారారు. గరిటె తిప్పి భారత వంటకాన్ని తయారుచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. బిల్‌గేట్స్ టాలెంట్‌ని మెచ్చుకున్న భారత ప్రధాని మోదీ, ఈసారి తృణధాన్యాలతో వంటకాలు ట్రై చేయండంటూ సలహా ఇచ్చారు.
బిల్‌గేట్స్‌తో కలిసి ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ ఐటన్ బెర్నాత్ ఓ కుకరీ వీడియో చేశారు. ఇందులో గేట్స్ భారతీయ వంటకమైన రోటీ తయారు చేశారు. గోధుమ పిండి కలిపి చపాతీ చేసి కాల్చారు. ఆ తర్వాత ఇద్దరూ ఆ రోటీలని రుచిచూశారు. ఈ వీడియోను గేట్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ మధ్యే తాము భారత్‌లో పర్యటించామని, ఆ సమయంలో బిహార్‌లో గోధుమ రైతులను కలిసి వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నామన్నారు. అక్కడి మహిళలతో కలిసి వారి నుంచి రోటీ ఎలా తయారు చేసుకోవాలని తెలుసుకున్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు.
ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేస్తూ..గేట్స్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్‌లో ప్రజెంట్ మిల్లెట్స్ ట్రెండ్ నడుస్తోందని, అవి ఆరోగ్యానికి ఎంతో మంచివని తెలిపారు. మిల్లెట్స్‌తో కూడా వంటకాలు ట్రై చేయండి అని సూచిస్తూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు ప్రధాని మోదీ.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ .చేయండి..