మన సమాజంలో ప్రతి రోజూ ఏదో ఒక రకమైన వైరస్‌లు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అయితే మన్నటి వరకూ కోవిడ్ విజృంభించిన విధానం ప్రపంచ దేశాలనే కలవరపెట్టింది. ప్రస్తుతం అమెరికాలో వాంపైర్ వైరస్‌లు మొట్టమొదటి సారి కనుగొనబడ్డాయి. వాంపైర్ వైరస్ అంటే ఏమిటి. ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది.. దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
‘వాంపైర్ వైరస్‌లు’ అమెరికాలో మొదటిసారి కనుగొనబడ్డాయి. దీనిపై శాస్త్రవేత్తలు తీవ్రంగా పరిశోధనలు చేసి శాస్త్రీయంగా గుర్తించారు. అమెరికాలోని మేరీల్యాండ్, మిస్సౌరీలోని మట్టి నమూనాలలో ఈ ప్రమాదకరమైన వైరస్‌లు పెరిగినట్లు గుర్తించారు. వీటి ఉనికి గురించి పరిశోధకులకు దశాబ్ధాలుగా తెలిసినప్పటికీ, మట్టి నమూనాలలో ఇది సరికొత్త రకంగా మొదటిసారి కనుగొనబడింది. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ బాల్టిమోర్ కౌంటీ పరిశోధకులు మొబైల్ జెనెటిక్ ఎలిమెంట్స్ (MGEs) అని నామకరణం చేశారు. వైరస్ ఎంటిటీలపై స్పష్టమైన సంకేతాలను కనుగొన్నారు పరిశోధకులు. అవి బ్యాక్టీరియా కణాల్లో చొచ్చుకుపోయి ప్రజలకు సోకినప్పుడు సహాయక వైరస్‌లుగా మారుతాయి. పందులలో కనుగొనబడిన ఇన్ఫ్లుఎంజా ఎ వైరస్ నమూనాలు కొత్త జాతులుగా ఉత్పత్తి చెందినప్పుడు ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది.
వాంపైర్ వైరస్‌లు తమ జన్యువులను దేహంలోని ప్రదాన కణాలలోకి చొప్పించడానికి సహాయకులుగా వ్యవహరిస్తాయి. రెండు వైరస్‌లు ఒకే సమయంలో శరీరంలోని కణాలకు సోకేలా ఇది దోహదపడుతుంది. ఈ వైరస్ వ్యక్తిలో సంభవించినప్పుడు కణాలకు దగ్గరగా ఉండాలి. అయితే, ఈ ఇటీవలి పరిశీలనలో ఆధారిత వైరస్ సహాయక వైరస్‌తో అతుక్కొని కనిపించినట్లు గుర్తించారు. గతంలో జాంబీ వైరస్ గురించి పూర్తి వివరాలు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలచే పునరుద్ధరించారు. 48,500 సంవత్సరాల క్రితం పండోరా వైరస్ యెడోమా గురించి తెలియజేశారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన సరికొత్త రకమైన వాంపైర్ వైరస్ ఆందోళనను కలిగిస్తోంది. ఈ వైరస్ ‘మెడ’ వద్ద ఏర్పడినట్లు గుర్తించారు.
ఇక్కడ సహాయక వైరస్ కీలకపాత్ర పోషించి బయటి కణాలతో కలిసిపోతుంది. ఈ వైరస్‌లను కనుగొనడానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ని ఉపయోగించడం ద్వారా కనిపించాయని తెలిపారు శాస్త్రవేత్తలు. జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మైక్రోబియల్ ఎకాలజీలో అక్టోబర్ 31న ప్రచురించబడిన ఒక అధ్యయనంలో ఇది వెలువడింది. సాధారణంగా జరిగే అండర్ గ్రాడ్యుయేట్ ప్రాజెక్ట్‌లో భాగంగా శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను ప్రారంభించారు. ఇక్కడ బ్యాక్టీరియోఫేజెస్ అంటే బ్యాక్టీరియాను సోకే వైరస్‌లు.. పర్యావరణ నమూనాల నుండి వేరుచేయబడతాయని కనుగొన్నారు. వీటి పరిశోధన ద్వారా రెండు వైరస్‌లు బ్యాక్టీరియాతో ఏకీభవించడం కోసం కొన్ని శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపారు. పరిశోధకులు ఒకే రకమైన ప్రయోగాలను అనేకసార్లు చేసినప్పటికీ ఈసారి సత్ఫలితాలను ఇచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..