AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk Party: మరో కొత్త రాజకీయ పార్టీ.. పేరు ఏంటో తెలుసా..?

 Elon Musk Party: మరోవైపు ఎలాన్‌ మస్క్‌కు రష్యా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ట్రంప్‌తో మస్క్ మధ్య వివాదం తీవ్రరూపం దాల్చుతున్న వేళ, రష్యా అనూహ్యంగా స్పందించింది. అవసరమైతే ఎలాన్ మస్క్‌కు రాజకీయ ఆశ్రయం కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా సూచనప్రాయంగా వెల్లడించింది..

Elon Musk Party: మరో కొత్త రాజకీయ పార్టీ.. పేరు ఏంటో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Jun 07, 2025 | 1:04 PM

Share

Elon Musk Party: మస్క్, ట్రంప్ మధ్య స్నేహానికి కళ్లెం పడింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో పార్టీ పెడతానని చెప్పిన 24 గంటల్లోనే దాని పేరును కూడా అనౌన్స్ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు ఎలాన్ మస్క్. పార్టీ పెట్టాలా.. వద్దా అనే అంశంపై ఎక్స్‌లో పోల్ పెట్టారు. దీనిపై 80 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారని మస్క్‌ వెల్లడించారు. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరమన్న మస్క్.. పార్టీకి “ది అమెరికా పార్టీ” అనే పేరు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జిగిరి దోస్తులుగా ఉన్న మస్క్‌ – ట్రంప్‌.. ఇప్పుడు దుష్మన్‌ అయ్యారు. గతంలో ట్రంప్‌కు మద్దతుగా ఉన్న మస్క్.. ఇటీవల ట్రంప్ ప్రభుత్వ ఖర్చులకు సంబంధించిన కొన్ని విధానాలను విమర్శించారు. దీనిపై ట్రంప్ కూడా మస్క్‌ను విమర్శించారు. ఈ నేపథ్యంలోనే మస్క్ కొత్త పార్టీ ఆలోచనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే మస్క్ పార్టీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికన్ ప్రజలు.. మస్క్ పార్టీకి “ది అమెరికా పార్టీ” అనే పేరును నెటిజన్లు సూచించారు. మస్క్ దానికి సానుకూలంగా స్పందించారు.

ఎలాన్‌ మస్క్‌, ట్రంప్‌ మధ్య విభేదాలు కొనసాగుతుండగా, మస్క్‌పై స్పందించారు ట్రంప్‌.. ఎలాన్‌ మస్క్‌ గురించి ప్రస్తుతం ఏమీ ఆలోచించడంలేదన్నారు. చైనా, రష్యా సహా ఇతర అంశాల్లో బిజీగా ఉన్నట్లు చెప్పారు ట్రంప్. ఎలాన్‌ మస్క్‌ బాగుండాలని కోరుకుంటున్నా అని అన్నారు

ఇవి కూడా చదవండి

మరోవైపు.. శత్రువును ట్రంప్‌ అంత తేలిగ్గా వదిలిపెట్టరు. తన ఆదేశాలను పాటించని అమెరికా విశ్వవిద్యాలయాలపై ఇప్పటికే కొరడా ఝళిపిస్తున్నారు. సుంకాల విషయంలోనూ రాజీపడటం లేదు. నిన్నటివరకు మిత్రుడిగా ఉండి అకస్మాత్తుగా శత్రువుగా మారిన మస్క్‌ విషయంలో ఇందుకు భిన్నంగా ట్రంప్‌ వ్యవహరిస్తారని భావించలేం. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిపై మస్క్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఇప్పుడు తాను కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందన్న సంకేతాలనూ పంపారు. ఈ స్థాయిలో మస్క్‌ దాడి చేసిన తర్వాత ట్రంప్‌ మౌనంగా ఉండే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు ఎలాన్‌ మస్క్‌కు రష్యా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ట్రంప్‌తో మస్క్ మధ్య వివాదం తీవ్రరూపం దాల్చుతున్న వేళ, రష్యా అనూహ్యంగా స్పందించింది. అవసరమైతే ఎలాన్ మస్క్‌కు రాజకీయ ఆశ్రయం కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రష్యా స్టేట్ డూమా అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ఫస్ట్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోవ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పన్నుల బిల్లుపై మస్క్ విమర్శలతో మాటల యుద్ధం రాజుకుంది. ఐతే ఇది అమెరికా అంతర్గత వ్యవహారమని, జోక్యం చేసుకోబోమని క్రెమ్లిన్ స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..