Special Garage: పెట్టుబడుల ద్వారా సంపాదించాలనుకునే వారు ఎక్కువగా ఆస్తులు కొనుగోలు, అమ్మకాలను ప్రధాన ఎంపికగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. అయితే, గత కొద్దికాలంగా ఈ ఆస్తుల డీలింగ్స్ వ్యవహారాలు ఆన్‌లైన్‌లోకి మారిపోయాయి. ప్రస్తుత కాలంలో ప్రజలు ఆస్తి కొనుగోలు చేయాలనుకున్నా ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. బ్రోకర్స్ ద్వారా కాకుండా నేరుగా యజమానిని సంప్రదించడం ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారు. దాంతో విక్రేతకు, కొనుగోలుదారులకు మధ్య ఎలాంటి సమస్యా తలెత్తడం లేదు. ఇదంతా ఇలా ఉంటే.. తాజాగా ఓ చిన్న గ్యారేజీని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు గ్యారేజీ యజమాని. దానికి ఊహించని రీతిలో డిమాండ్ వచ్చింది. ఏకేంగా కోట్ల రూపాయలు చెల్లించి ఆ గ్యారేజీని సొంతం చేసుకునేందుకు ముందుకొచ్చారు కొనుగోలుదారులు.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. యూకే లోని న్యూకాజిల్‌లో ఈ గ్యారేజీ ఉంది. ఈ గ్యారేజీని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు యజమాని. అయితే, గ్యారేజీ వెనుక ఓ టెన్నిస్ కోర్టు ఉంది. ఆ టెన్నీస్ కోర్టు కారణంగానే దానికి విపరీతమైన డిమాండ్ వస్తోంది.
ఆ గ్యారేజీకి కోట్ల రూపాయలు ఎందుకు?
వాస్తవానికి ఈ గ్యారేజీ ఉన్న ప్రదేశం బ్రిటన్‌లోని అత్యంత ప్రాధాన్యత గల ప్రాంతం. ఈ గ్యారేజీ వెనుకాలే ఓ ప్రైవేట్ టెన్నిస్ కోర్టు ఉండటం దానికి కలిసొచ్చింది. అంతకంటే ముఖ్యంగా ఈ గ్యారేజీ ఉన్న ప్రాంతంలో ధనవంతులకు నిలయం. అనేక ప్రసిద్ధ పాఠశాలలు కూడా ఉన్నాయి. అయితే, Property selling site RightMove సైట్‌లో ఈ గ్యారేజీని విక్రయానికి పెట్టారు. ఈ గ్యారేజీ ఫోటోను సైట్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు చాలా మంది కొనుగోలుదారులు ఈ చిన్న గ్యారేజీని కొనడానికి కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చించాలని అనే ప్రశ్నలను లేవనెత్తారు. అయితే, రైట్‌మూవ్ సైట్ గ్యారేజీతో కూడిన టెన్నిస్ కోర్ట్ ఫోటోని చూసి.. చాలా మంది దానిని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే.. ఆ గ్యారేజీని కొనుగోలు చేసిన వారు పక్కనే ఉన్న టెన్నిస్ కోర్టుకు కూడా యజమాని అవుతారు. ఆ కారణంగానే దానిని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తిచూపుతున్నారు.