UAE Floods: ఎడారి రాజ్యంలో వరదల బీభత్సం.. ఏడుగురు మృతి.. నెట్టింట వీడియోలు వైరల్‌

|

Jul 30, 2022 | 6:46 AM

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌, యూఏఈ, ఇరాన్‌లను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఇళ్లు, వాహనాలు నీటిలో కొట్టుకుపోయి. మృతుల సంఖ్య భారీగానే నమోదైంది.

UAE Floods: ఎడారి రాజ్యంలో వరదల బీభత్సం.. ఏడుగురు మృతి.. నెట్టింట వీడియోలు వైరల్‌
Uae Floods
Follow us on

UAE Floods: ఎడారి రాజ్యంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారీ వర్షంతో దెబ్బతింది. యూఏఈలోని షార్జా, ఫుజారియా నగరాల్లో వరద పోటెత్తింది. కార్లు బొమ్మల్లా తెలియాడుతూ.. నీళ్లల్లో కొట్టుకుపోయాయి. వరదజోరుకు షాపులకున్న అద్దాలు పగిలిపోయాయి. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రెండు నగరాల్లో పలువురిని కాపాడారు. వరదల నుంచి కాపాడుకునేందుకు చాలా మంది హోటల్స్‌ను ఆశ్రయించారు. కాగా దుబాయి, అబుదాబి నగరాల్లో మాత్రం వర్షపాతం తక్కువగా నమోదైంది.

ఈ వరదల ధాటికి ఇప్పటివరకు ఏడుగురు ప్రవాసులు మరణించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దంటూ అధికారులు ప్రకటించారు. 27 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌లో 100 దాటిన మృతుల సంఖ్య..

పాకిస్తాన్‌ వాయువ్య ప్రాంతంలోని బలూచిస్తాన్‌- భీకర వరదలతో అల్లాడిపోయింది. ఆకస్మిక వరదలతో మృత్యుపాశం అయ్యాయి. ఈ బీభత్స వరదలకు ఇప్పటిదాకా 111 మంది చనిపోయారు. 6700 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. బలూచిస్తాన్‌లోని లాస్బెలా, ఝల్ మాగ్సీ, కెచ్, ఖుజ్దార్ జిల్లాలు వరదల కారణంగా చాలా దెబ్బతిన్నాయి.. లస్బెలా జిల్లాలో మహిళలు, చిన్నారులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. బలూచిస్తాన్‌ను సింధ్‌తో కలిపే వంతెనతో సహా అనేక రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. క్వెట్టా-కరాచీ నగరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఇరాన్‌లో 8 మంది..

ఇరాన్‌ను కూడా ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి.. వరదల్లో చిక్కి 8 మంది మరణించారు.. మరో 8 మంది గాయపడ్డారు. 19 మంది తప్పిపోయారు. ఎమామ్జాదే దావూద్ గ్రామంలో కొండచరియ విరిగిపడటంతో ఒక గ్రామంలో నాలుగు మీటర్ల మేర బురద కూరుకుపోయింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఇరాన్‌లోని 18 ప్రావిన్స్‌ మీద తీవ్ర ప్రభావాన్నిచూపించాయి. ఇరాన్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కిన 500 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..