PM Modi: బ్రూనై చేరుకున్న ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు

|

Sep 03, 2024 | 8:16 PM

రెండు రోజుల పర్యాటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బ్రూనై రాజధాని బందర్ సెరి బెగవాన్‌లోని ఓ గ్రాండ్ హోటల్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భారతీయ ప్రవాసులు పెద్ద ఎత్తున తరలిరావడంతో హోటల్‌..

రెండు రోజుల పర్యాటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బ్రూనై రాజధాని బందర్ సెరి బెగవాన్‌లోని ఓ గ్రాండ్ హోటల్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భారతీయ ప్రవాసులు పెద్ద ఎత్తున తరలిరావడంతో హోటల్‌ వద్ద భారీగా జన సమూహం ఏర్పడింది. హోటల్‌ వద్దకు చేరుకున్న ప్రవాస భారతీయులతో మోదీ కరచాలనం చేశారు. ఈ సందర్భంగా మోదీ భారతీయులతో మాట్లాడారు. ప్రధానిని చూసిన చిన్నారులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. మోదీ పలువురికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌, బ్రూనై దేశాల మధ్య ఉన్న 40 ఏళ్ల దౌత్య సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌నున్నారు. బ్రూనై దేశంలో భారత ప్రధాని పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటన పూర్తికాగానే మోదీ అక్కడి నుంచి సింగపూర్‌ వెళతారు. ఇదిలా ఉంటే బ్రూనే దేశం సుల్తాన్‌ హస్సనాల్‌ బోల్కియా.. ప్రపంచంలోని సంప‌న్న వ్య‌క్తుల్లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రిటన్‌ క్వీన్‌ ఎలిజబెత్‌ రాణి 2 తరువాత ప్రపంచంలోనే రెండవ అత్యధిక కాలం పాలించిన చక్రవర్తిగా కూడా సుల్తాన్‌కు పేరుంది.

అత్యంత వివాలసవంతమైన జీవితానికి పెట్టింది పేరు సుల్తాన్‌.. ఇయన సంపద దాదాపు 30 బిలియన్ డాలర్లు. ఆయనకు సంపద ప్రధానంగా బ్రూనై చమురు, సహజ వాయువు నిల్వల నుంచి వస్తుంది. సుల్తాన్ బ‌ల్కియా వ‌ద్ద సుమారు ఏడు వేల ల‌గ్జ‌రీ వాహ‌నాలు ఉన్నాయి. సుల్తాన్‌ దగ్గర సుమారు రూ. 4 లక్షల కోట్ల విలువైన కార్లు ఉన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..