Satya Nadella: పెరిగిన సత్య నాదెళ్ల వేతనం.. ఫోన్ నెంబర్ అంత ఉందిగా మన తెలుగోడి జీతం.!

|

Oct 25, 2024 | 1:24 PM

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల జీతం 63% పెరిగి $79.1 మిలియన్లకు చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.665 కోట్ల వేతనం పొందాడు.

Satya Nadella: పెరిగిన సత్య నాదెళ్ల వేతనం.. ఫోన్ నెంబర్ అంత ఉందిగా మన తెలుగోడి జీతం.!
Microsoft Ceo Satya Nadella
Follow us on

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 2024 ఆర్థిక సంవత్సరంలో USD 79.1 మిలియన్ (రూ. 665.04 కోట్లు జీతం అందుకుంటున్నారు.  ప్రాథమికంగా స్టాక్ అవార్డుల కారణంగా గత సంవత్సరం కంటే 63 శాతం జీతం పెరిగినట్లు తెలుస్తుంది. 2014లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు 84 మిలియన్ డాలర్లు (రూ.706.24 కోట్లు) అందజేసిన తర్వాత సత్య నాదెళ్ల  అందుకున్న అత్యధిక వేతనం ఇదే కావడం విశేషం. OpenAIలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడి వారిక కలిసొచ్చింది. దీంతో నాదెళ్ల స్టాక్‌లకు భారీగా లాభాలు వచ్చినట్లు తెలుస్తుంది.

నాదెళ్ల 2024 పరిహారంలో దాదాపు 90 శాతం స్టాక్ అవార్డుల నుండి తీసుకోబడింది. ఇది USD 39 మిలియన్ (రూ. 327.88 కోట్లు) నుండి సుమారు USD 71 మిలియన్లకు (రూ. 596.92 కోట్లు) పెరిగింది. మైక్రోసాఫ్ట్  మార్కెట్ షేర్లు 31.2 శాతం పెరిగాయి. దాని విలువ USD 3 ట్రిలియన్‌లను అధిగమించింది. పరిహారం ప్యాకేజీ గణనీయంగా ఉన్నప్పటికీ, సైబర్‌ సెక్యూరిటీ సమస్యల కారణంగా తన నగదు వేతనం తగ్గించాలని నాదెళ్ల కోరినప్పటికీ మైక్రోసాఫ్ట్ తనపై ఉన్న నమ్మకంతో వేతనం పెంచినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది వార్షిక వేతరం భారీగా పెరిగినా, ఇందులో స్టాక్ ఆప్షన్స్ ఎక్కువ, క్యాష్ ఇన్సెంటివ్స్ తక్కువ ఉన్నట్లు SEC ఫెలింగ్ ద్వారా వెల్లడైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి