మళ్లీ ఆస్పత్రిలో చేరిన జపాన్ ప్రధాని

జపాన్ ప్రధాని షింజో అబే మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సోమవారం అయన అనారోగ్య సమస్యలతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. టోక్యో ఆస్పత్రి డాక్టర్లు దాదాపు ఏడు గంటలపాటు ఆయనకు పరీక్షలు నిర్వహించారు.

మళ్లీ ఆస్పత్రిలో చేరిన జపాన్ ప్రధాని
Follow us

|

Updated on: Aug 24, 2020 | 7:03 PM

జపాన్ ప్రధాని షింజో అబే మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సోమవారం అయన అనారోగ్య సమస్యలతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. టోక్యో ఆస్పత్రి డాక్టర్లు దాదాపు ఏడు గంటలపాటు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ప్రధాని ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో దేశవ్యాప్తంగా ఆందోళనకు  గురయ్యారు.. ఈ ఏడాది జులై 6న షింజో అబే తన కార్యాలయంలో బ్లెడ్ వామిట్స్ చేసుకున్నట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రధాని కార్యాలయ సిబ్బంది ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. ఇదివుండగా, ప్రధాని సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆస్పత్రికి వచ్చారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆర్థిక మంత్రి కట్సునోబు కటో తెలిపారు. ప్రధాని పదవి నుంచి షింజో వైదొలగితే ఉప ప్రధానిగా ఉన్న తారో అసో తాత్కాలిక బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ప్రధాని రాజీనామా చేయాలనుకుంటే ఎన్నికలు ముగిసి మరొకరు ప్రధాని అయ్యే వరకు షింజోనే ఆ పదవిలో కొనసాగనున్నట్లు సమాచారం.