Drone Footage: చనిపోయింది హమాస్ నాయకుడు యాహ్యా సిన్వర్‌.. ఇదిగో వీడియోః ఐడీఎఫ్

|

Oct 18, 2024 | 1:07 PM

గాజాలో వైమానిక దాడిలో మరణించిన ముగ్గురిలో హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్‌ కూడా ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) గురువారం ధృవీకరించింది.

Drone Footage: చనిపోయింది హమాస్ నాయకుడు యాహ్యా సిన్వర్‌.. ఇదిగో వీడియోః ఐడీఎఫ్
Yahya Sinwar
Follow us on

గత ఏడాది కాలంగా హమాస్ పై జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ ఘన విజయం సాధించింది. జులైలో హమాస్‌ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియా మరణం తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన మరో కీలక నేత యాహ్యా సిన్వర్‌ను కూడా ఇజ్రాయెల్‌ మట్టుబెట్టింది. అతను దాక్కున్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ దళాలు చుట్టుముట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిన్వర్‌ బయటకు వచ్చినట్లు ఇజ్రాయెల్‌ సైనిక అధికారులు తెలిపారు. యాహ్యా సిన్వర్‌ జైలులో ఉన్నప్పుడు సేకరించిన DNAతో పోల్చి- చనిపోయింది సిన్వర్‌ అని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

గురువారం (అక్టోబర్ 17) హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ హత్యను ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు. హమాస్ దాడి సూత్రధారి యాహ్యా సిన్వార్‌ను హతమార్చినట్లు ఐడీఎఫ్ తెలిపింది. అంతే కాకుండా మరో ఇద్దరు కూడా ఈ ఘటనలో మృతి చెందారు. ఇదిలా ఉండగా, దాడికి సంబంధించిన డ్రోన్ షాట్‌ను ఇజ్రాయెల్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సిన్వర్‌ను ముట్టబెట్టడానికి ముందు జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. యాహ్యా సిన్వార్ చివరి క్షణాలను చూపిస్తుంది. అందులో అతను గాయపడిన సోఫాలో కూర్చుని డ్రోన్ వైపు చూస్తున్నాడు. కుడిచేతికి గాయమైనప్పటికీ తనపై దాడికి వస్తున్న డ్రోన్‌ను సిన్వర్‌ తన ఎడమ చేత్తో అడ్డుకుంటున్న దృశ్యం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. గతేడాది అక్టోబర్‌ ఏడున ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన దాడికి ప్రధాన సూత్రధాని సిన్వర్‌ అని ఇజ్రాయెల్‌ భావిస్తోంది.

బుధవారం (అక్టోబర్ 16) గాజాలో జరిగిన ఆపరేషన్‌లో 450వ బెటాలియన్‌కు చెందిన సైనికుడు అనుమానాస్పద వ్యక్తి భవనంలోకి ప్రవేశించడాన్ని చూశారని ఇజ్రాయెల్ మిలిటరీ ఫోర్సెస్ ప్రతినిధి తెలిపారు. దీని తరువాత కమాండర్ కాల్పులు జరపమని ఆదేశించాడు. ఆర్డర్ అందుకున్న వెంటనే ఆర్మీ సైనికులు చర్యలు ప్రారంభించారు. అతను మొదట డ్రోన్‌తో భవనంలో శోధించాడు. అక్కడ ముగ్గురు వ్యక్తులు దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూశారు. అప్పుడే సైనికులు కాల్పులు ప్రారంభించారు.

దీని తర్వాత మిగిలిన ఇద్దరు వ్యక్తులు పారిపోగా, మూడో వ్యక్తి భవనంలోని రెండో అంతస్తులోకి ప్రవేశించాడు. అయితే, అప్పటి వరకు సైనికులకు తాము చుట్టుముట్టిన వ్యక్తి మరెవరో కాదు, సిన్వార్ అని తెలియదు. ఇది జరిగిన వెంటనే, యుద్ధ ట్యాంక్ ద్వారా దాడి జరిగింది. దీంతో భవనం పూర్తిగా ధ్వంసమైంది. లోపల దాక్కున్న వ్యక్తి (సిన్వార్) కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

ఇజ్రాయెల్ సైన్యం బుధవారం దాడి అనంతరం గురువారం (అక్టోబర్ 17) భవనంలో వెతకడానికి వెళ్లగా, వారికి యాహ్యా సిన్వార్‌లా కనిపించే వ్యక్తి కనిపించాడు. దీన్ని ధృవీకరించేందుకు, సైన్యం DNA పరీక్ష చేయాలని నిర్ణయించుకుంది. మరణించిన వ్యక్తి నిజంగా సిన్వారే కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో మరణించిన వ్యక్తి ఇజ్రాయెల్‌ను ఓడించిన హమాస్‌కు చెందిన అత్యంత భయంకరమైన వ్యక్తి సిన్వార్ అని DNA పరీక్ష నిర్ధారించింది. దీంతో ఇరాన్ నిర్మించిన ఉగ్రవాద వృక్షం కూలిపోతోందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్ పాలన.. టెర్రర్ పాలన కూడా ముగుస్తుందన్నారు. యాహ్యా సిన్వార్, హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హత్యలను ప్రస్తావించారు.

వీడియో

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..