Donald Trump: ట్రంప్‌పై కాల్పుుల ఘటనలో కుట్ర కోణం..? ఎఫ్‌బీఐ అధికారుల విచారణలో మరో షాకింగ్ ట్విస్ట్!

గురి తప్పలేదు అని చెప్పడానికి 'గన్‌షాట్‌' అనే వర్డ్‌ వాడుతుంటారు. ట్రంప్‌ విషయంలో గన్‌షాట్‌ గురి తప్పి ఉండొచ్చు గానీ.. టార్గెట్‌ మాత్రం మిస్సవలేదు. ఏ లక్ష్యంతో ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారో.. ఆ లక్ష్యాన్ని సాకారం చేయబోతోంది ఆ ఒక్క 'గన్‌షాట్'. ట్రంప్‌పై జరిగిన కాల్పులే.. విజయానికి దగ్గర చేశాయంటున్నాయి సర్వేలు.

Donald Trump: ట్రంప్‌పై కాల్పుుల ఘటనలో కుట్ర కోణం..? ఎఫ్‌బీఐ అధికారుల విచారణలో మరో షాకింగ్ ట్విస్ట్!
Donald Trump
Follow us

|

Updated on: Jul 16, 2024 | 8:08 AM

గురి తప్పలేదు అని చెప్పడానికి ‘గన్‌షాట్‌’ అనే వర్డ్‌ వాడుతుంటారు. ట్రంప్‌ విషయంలో గన్‌షాట్‌ గురి తప్పి ఉండొచ్చు గానీ.. టార్గెట్‌ మాత్రం మిస్సవలేదు. ఏ లక్ష్యంతో ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారో.. ఆ లక్ష్యాన్ని సాకారం చేయబోతోంది ఆ ఒక్క ‘గన్‌షాట్’. ట్రంప్‌పై జరిగిన కాల్పులే.. విజయానికి దగ్గర చేశాయంటున్నాయి సర్వేలు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై దాడి తర్వాత ఆయన క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. కాల్పుల ఘటనతో ట్రంప్‌కు అమెరికన్ల మద్దతు ఒక్కసారిగా పెరిగింది. దాడి ఘటనతో సింఫథీ తోడై.. విజయావకాశాలూ మెరుగుపట్టాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తూటా తాకిన వెంటనే కిందకు వంగి.. తర్వాత పిడికిలి బిగించి బలంగా పైకి లేచిన ట్రంప్‌ తీరు పలువురిని ఆకట్టుకుందని చెబుతున్నారు.

జో బైడెన్‌ కంటే ట్రంప్ ముందు వరుసలో ఉన్నారని పలు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇక కాల్పుల ఘటనపై ట్రంప్‌ మరోసారి స్పందించారు. దాడిలో చనిపోయాననే అనుకున్నానన్నారు. అమెరికాలాంటి దేశంలో ఇలాంటి చర్య నమ్మశక్యంగా లేదని ట్రంప్‌ అన్నారు .

మరోవైపు కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ జరుపుతోంది ఎఫ్‌బీఐ. నిందితుడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడు…? దాడికి గల కారణాల గురించి తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. అయితే నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడనే కారణం ఇంకా వెలుగులోకి రాలేదు కానీ.. విస్తుగొలిపే నిజాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. థామస్ తన కారులో కొన్ని పేలుడు పదార్థాలను ప్యాక్ చేశాడని, ఆ కారుతోనే ర్యాలీకి వచ్చాడని విచారణలో వెల్లడైంది. ట్రంప్‌పై కాల్పులు చేసిన తుపాకి థామస్‌కు ఎక్కడి నుంచి లభ్యమైందన్న కోణంలో విచారించగా, అది నిందితుడి తండ్రిదేనని తేలింది.

ఈ దాడి వెనుక థామస్ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం కోసం అతని .. పాఠశాల స్నేహితులతో పాటు ఇతర సన్నిహితులను సైతం ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్ కోర్టు రికార్డుల ప్రకారం.. థామస్‌కి ఎలాంటి నేర చరిత్ర లేదని కూడా స్పష్టమైంది. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై తుపాకి కాల్పుల్లో కుట్ర కోణం ఉందా? అమెరికా ఎన్నికలకు మరో 3 నెలల సమయం ఉండగానే రాజకీయ లబ్ధి కోసమే రిపబ్లికన్లు ఇలా చేశారా? అన్న అనుమానాలను కొందరు లేవనెత్తుతున్నారు. తుపాకీతో కాల్పులు జరిగినా అక్కడి సమూహంలో ఎవరూ పరిగెత్తలేదు. భయపడలేదు. నేను ట్రంప్‌ని నమ్మను అంటూ ఓ అమెరికన్‌ వ్యక్తి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు అధికారిక డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు చేస్తున్నట్లు ఓ నివేదిక తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మిర్రర్ సెల్ఫీతో మాయ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా?
మిర్రర్ సెల్ఫీతో మాయ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా?
తోకతో పుట్టిన చిన్నారి.. వైద్యులు షాక్!
తోకతో పుట్టిన చిన్నారి.. వైద్యులు షాక్!
దోడా ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ అధికారి, ముగ్గురు జవాన్లు వీరమరణం..
దోడా ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ అధికారి, ముగ్గురు జవాన్లు వీరమరణం..
అప్పుడేమో చబ్బీ.. ఇప్పుడేమో అందానికే అటామ్ బాంబ్
అప్పుడేమో చబ్బీ.. ఇప్పుడేమో అందానికే అటామ్ బాంబ్
ఒకప్పుడు తెగ కొట్టుకున్న ఆ ముగ్గురు.. కలిసి ముందుకెళ్తారా..?
ఒకప్పుడు తెగ కొట్టుకున్న ఆ ముగ్గురు.. కలిసి ముందుకెళ్తారా..?
శ్రీక్షేత్రంలో మరో రహస్య గది.. రాజులు సమర్పించిన విలువైన సంపాద
శ్రీక్షేత్రంలో మరో రహస్య గది.. రాజులు సమర్పించిన విలువైన సంపాద
బడి నుంచి వెళ్లి.. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ఇంట్లో శవమైన బాలిక..
బడి నుంచి వెళ్లి.. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ఇంట్లో శవమైన బాలిక..
విల్లాస్‌లో పక్కా అవినీతి జరిగిందిః ఎమ్మెల్యే దామచర్ల
విల్లాస్‌లో పక్కా అవినీతి జరిగిందిః ఎమ్మెల్యే దామచర్ల
మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. రీరిలీజ్ కానున్న బ్లాక్ బస్టర్ మూవీ
మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. రీరిలీజ్ కానున్న బ్లాక్ బస్టర్ మూవీ
సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్ద రణరంగం..ఎక్కడికక్కడ అరెస్టులు! వీడియో
సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్ద రణరంగం..ఎక్కడికక్కడ అరెస్టులు! వీడియో