పాక్ ప్రధాని ఏ కారు వాడుతారో తెలుసా..?

TV9 Telugu

29 June 2024

ప్రస్తుతం భరత్ పొరుగు దేశం, శత్రు దేశమైన పాకిస్థాన్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏమైంది అనుకొంటున్నారా.?

ప్రపంచంలో అనేక దేశాల వలె పాకిస్థాన్ కూడా అధిక ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోందని నివేదికలు వెల్లడించాయి.

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ దగ్గర ఉన్న కార్ల కలెక్షన్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

పాకిస్తాన్ ప్రధాని టయోటా ల్యాండ్ క్రూయిజర్ అనుకూలీకరించిన కారును నడుపుతున్నారు. బుల్లెట్ ప్రూఫ్‌తో కూడిన ఈ కారు ఖరీదు దాదాపు రూ.3.5 కోట్లు.

టయోటా ల్యాండ్ క్రూయిజర్ తో పాటు పాక్ ప్రధాని మెర్సిడెస్ మేబ్యాక్ S600 గార్డ్‌లో కూడా ప్రయాణిస్తారు.

పాక్ ప్రధాని మెర్సిడెస్ మేబ్యాక్ S600 గార్డ్‌ కారు ప్రపంచంలోని సురక్షితమైన కార్లలో ఒకటిగా నిపుణులు భావిస్తారు.

పాక్ ప్రధాని వాడుతున్న మెర్సిడెస్ మేబ్యాక్ S600 గార్డ్‌ కారు ధర రూ.12.26 కోట్లు ఉందని నివేదికలు తెలుపుతున్నాయి.

మెర్సిడెస్ మేబ్యాక్ S600 గార్డ్ 4.8 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని అధికారులు చెబుతున్నారు.