సింగపూర్ లో భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం

విదేశాల్లో మరో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌ లా అకాడమీ అధిపతిగా భారత సంతతికి చెందిన న్యాయవాది రామ తివారీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎస్‌ఏఎల్‌ సీఈఓగా ఉన్న సెరెన్‌ రిటైర్‌ అవుతుండటంతో ఆయన స్థానంలో రామ తివారీని నియమిస్తూ సింగపూర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సింగపూర్ లో భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం
Follow us

|

Updated on: Aug 27, 2020 | 11:40 AM

విదేశాల్లో మరో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌ లా అకాడమీ అధిపతిగా భారత సంతతికి చెందిన న్యాయవాది రామ తివారీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఎస్‌ఏఎల్‌ సీఈఓగా ఉన్న సెరెన్‌ రిటైర్‌ అవుతుండటంతో ఆయన స్థానంలో రామ తివారీని నియమిస్తూ సింగపూర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

లండన్ లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసించిన తివారీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ ఎంఎస్సీ పూర్తి చేశారు. 1999లో సింగపూర్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేరిన ఆయన ఆ తరువాత ప్రైవేట్ ప్రాక్టీసులో చేరాడు. ఐటీ, మేధో సంపత్తి సమస్యలపై ప్రత్యేక నైపుణ్యం సాధించారు. ఓ బ్యాంకు ఉపాధ్యక్షుడిగా, యూఎస్ టెక్నాలజీ కంపెనీకి గ్లోబల్ సేల్స్ లీడ్‌గానూ ఆయన పని చేసిన అనుభవం ఉంది. ప్రైవేటు రంగంలో ఆయనకు దాదాపు 20 ఏండ్లకుపైగా అనుభవం ఉంది. ఎస్‌ఏఎల్‌ సీఈఓగా నియమితులవ్వడం పట్ల రామ తివారీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.