ఉసేన్ బోల్ట్ రికార్డ్ బద్దలు కొట్టిన చైనా రోబో.. ఏకంగా గంటకు 45 కి.మీ పైగా వేగంతో పరుగు!
ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే మనిషి ఎవరు అంటే..గుర్తొచ్చే పేరు ఉసేన్ బోల్ట్. ఇప్పుడు ఆ పరుగుల రారాజు రికార్డునే రోబో అధిగమించింది! మనిషి చేయలేని సాహసాన్ని ఒక యంత్రం చేసి చూపించింది. చైనా రోబో 'టియాంగాంగ్ అల్ట్రా' అసాధారణ రికార్డు సృష్టించింది.

చైనాలో జరిగిన వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ వైపు ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. అచ్చం మనుషుల్లాగే హ్యమనాయిడ్ రోబోలు తాయ్ చీ, టెన్నిస్, రన్నింగ్ లో పాల్గొని సత్తా చాటాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే మనిషి ఎవరు అంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు ఉసేన్ బోల్ట్. కానీ, ఇప్పుడు ఆ పరుగుల రారాజు రికార్డునే రోబో అధిగమించింది! మనిషి చేయలేని సాహసాన్ని ఒక యంత్రం చేసి చూపించింది. చైనా రోబో ‘టియాంగాంగ్ అల్ట్రా’ అసాధారణ రికార్డు సృష్టించింది. కేవలం 9.39 సెకన్లలోనే వంద మీటర్ల దూరాన్ని పూర్తి చేసింది. ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ 2009లో 9.58 సెకన్లలో ఈ రికార్డు సాధించాడు. ఇప్పుడా రికార్డును చైనా రోబో బ్రేక్ చేసింది. ఇది గంటకు దాదాపు 45.6 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తిందన్నమాట. చైనాకు చెందిన ‘యూనిట్రీ’ సంస్థ ఈ సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను తయారు చేసింది. ‘సూపర్‌మ్యాన్’ అని పిలిచే ఈ రోబో అద్భుతం చేసింది. ఈ రోబో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మనిషి వేగాన్ని సైతం రోబో దాటేయడం చూసి నెటిజన్లు షాకవుతున్నారు!
పరుగులోనే కాదు.. జంప్‌లోనూ సూపర్!
కేవలం పరుగులోనే కాదు, హై జంప్ లోనూ ఈ రోబో అదరగొట్టింది. ఎలాంటి రన్‌అప్ లేకుండా, నిలబడిన చోటు నుంచే ఏకంగా రెండు మీటర్ల ఎత్తుకు ఎగిరింది! కేవలం మూడు నెలల్లోనే దీన్ని తయారు చేయడం విశేషం.
ఈ పోటీలో ‘లైట్నింగ్’ అనే మరో రోబో కూడా అద్భుతం చేసింది. 9.47 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అయితే, పరుగు ఆపిన వెంటనే అది కిందపడిపోవడంతో స్ట్రెచర్ పై తీసుకెళ్లాల్సి వచ్చింది. బీజింగ్ వేదికగా ఈ ఒలింపిక్స్ తరహా పోటీలు జరిగాయి. ఇందులో 16 దేశాల నుంచి సుమారు 2,000 రోబోలు పాల్గొన్నాయి. ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, మార్షల్ ఆర్ట్స్, హైజంప్ వంటి 51 విభాగాల్లో పోటీలు సాగాయి. రోబోటిక్స్ రంగంలో చైనా సాధిస్తున్న వేగవంతమైన పురోగతికి ఈ పోటీలే నిదర్శనం.
Unitree New Robot Preview: “Superman” Breaking the Limits of Humanity🥳 Standing high jump 2 m, top speed 12.66 m/s (0.85 m leg length) Surpassing the standing high jump and running speed records of all humans around the world This new machine has only been in development for a… pic.twitter.com/12i80ITU6p
— Unitree (@UnitreeRobotics) August 17, 2026