Srinivasa Ramanujan: స్కూల్‌లో రెండుసార్లు ఫెయిల్.. అదే స్కూల్‌కు ఆయన పేరు పెట్టిన వైనం.. గణితంలో ప్రపంచాన్ని ఏలిన రామానుజన్!

|

Dec 22, 2021 | 2:17 PM

పన్నెండో తరగతి రెండు సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి.. గణితంలో మాహాశక్తిగా మారారు.. ఎంతలా అంటే..ఏ పాఠశాలలో అయితే ఫెయిల్ అయ్యారో.. అదే పాఠశాలకు తనపేరు పెట్టేంతగా.. ఆయనే..శ్రీనివాస రామానుజన్.. ప్రపంచానికి లెక్కలు నేర్పించిన గొప్ప శాస్త్రవేత్త.

Srinivasa Ramanujan: స్కూల్‌లో రెండుసార్లు ఫెయిల్.. అదే స్కూల్‌కు ఆయన పేరు పెట్టిన వైనం.. గణితంలో ప్రపంచాన్ని ఏలిన రామానుజన్!
Srinivasa Ramanujan
Follow us on

Srinivasa Ramanujan: పన్నెండో తరగతి రెండు సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి.. గణితంలో మాహాశక్తిగా మారారు.. ఎంతలా అంటే..ఏ పాఠశాలలో అయితే ఫెయిల్ అయ్యారో.. అదే పాఠశాలకు తనపేరు పెట్టేంతగా.. ఆయనే..శ్రీనివాస రామానుజన్.. ప్రపంచానికి లెక్కలు నేర్పించిన గొప్ప శాస్త్రవేత్త. ఈయన డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఆయన గౌరవార్థం మన దేశంలో ఈరోజు ( డిసెంబర్ 22) జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారు. అప్పటి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2012లో డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటామని ప్రకటించారు.

ప్రపంచాన్ని ఏలిన గొప్ప గణిత  శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ గురించి కొన్ని విషయాలు..

శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్‌లో తమిళ బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. రామానుజన్ కుంభకోణంలోని ప్రభుత్వ కళాశాలలో చదివారు. కాని, గణితమేతర విషయాలపై ఆసక్తి లేకపోవడంతో అతని 12వ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. విచిత్రం ఏమిటంటే.. ఆయన 12వ తరగతిలో రెండుసార్లు ఫెయిల్ అయిన పాఠశాలకు ఇప్పుడు రామానుజన్ పేరు పెట్టారు. ఆయన 1912లో మద్రాసు పోర్ట్ ట్రస్ట్‌లో క్లర్క్‌గా పని చేయడం ప్రారంభించారు. అతని గణిత ప్రతిభను గణిత శాస్త్రజ్ఞుడు కూడా అయిన సహోద్యోగి ఇక్కడే మొదటిసారి గుర్తించారు. సహోద్యోగి రామానుజన్‌ని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో ప్రొఫెసర్ GH హార్డీ వద్దకు వెళ్లమని సూచించారు.

అయితే, 21 సంవత్సరాల వయస్సులో, రామానుజన్ జానకి అమ్మాళ్‌ను వివాహం చేసుకున్నారు. కానీ గణితంపై ప్రేమ అప్పుడు కూడా తగ్గలేదు. దీంతో ఒక లేఖ ద్వారా, అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ GH హార్డీకి కొన్ని ఫార్ములాలను పంపాడు. వాటిని చూసిన హార్డీ గణితంలో రామానుజన్ ప్రతిభకు ఆశ్చర్యపోయారు. ఆయన వెంటనే రామానుజన్‌ని లండన్‌కు ఆహ్వానించారు. రామానుజన్ గురువు అయ్యాడు. వీరిద్దరూ కలిసి గణితశాస్త్రానికి సంబంధించిన అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు. అతని పరిశోధనలను బ్రిటిష్ వారు కూడా గౌరవించారు.

ట్రినిటీ కాలేజీలో చేరిన తర్వాత, రామానుజన్ 1916లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc) డిగ్రీని అందుకున్నారు. 1917లో అతనికి లండన్ మ్యాథమెటికల్ సొసైటీలో స్థానం లభించింది. మరుసటి సంవత్సరం ఆయన గణితంపై చేసిన పరిశోధన కోసం రాయల్ సొసైటీలో స్థానం పొందాడు. అక్టోబర్ 1918లో, రామానుజన్ ట్రినిటీ కాలేజీ ఫెలోషిప్ పొందిన మొదటి భారతీయుడు కూడా అయ్యాడు. రామానుజన్ గణిత ప్రతిభను కేవలం 32 సంవత్సరాల జీవితంలో ఆయన 4 వేలకు పైగా గణిత సిద్ధాంతాలను పరిశోధించారు.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణిత శాస్త్రజ్ఞులకు అర్థం చేసుకోవడానికి సంవత్సరాలు పట్టింది. దీనిని బట్టి రామానుజన్ ప్రతిభ అంచనా వేయవచ్చు.

రామానుజన్ 1919 లో లండన్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. రామానుజన్ TBతో బాధపడి ఒక సంవత్సరం తర్వాత 1920లో మరణించారు. తన ప్రతిభతో యావత్ ప్రపంచంపై తనదైన ముద్ర వేసిన గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు తన మరణానంతరం సొంత ప్రజల మధ్య చిరాకును ఎదుర్కోవలసి వచ్చింది. సముద్రయానం నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రాయశ్చిత్తం కోసం రామేశ్వరం వెళ్ళనందున ఆయన మరణం తరువాత పండితులు రామనుజన్ దహన సంస్కారాలకు అంగీకరించలేదు.

రాబర్ట్ కనిగల్ రామానుజన్ జీవిత చరిత్రను ‘ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ: ఎ లైఫ్ ఆఫ్ ది జీనియస్ రామానుజన్’ అనే పేరుతో రాశారు. 2015లో ఆయనపై ‘ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ’ సినిమా కూడా తీశారు. ఈ చిత్రంలో దేవ్ పటేల్ ఆయన పాత్రను పోషించారు. ఈ చిత్రం రాబర్ట్ కనిగల్ రామానుజన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు.

ఇవి కూడా చదవండి: Smart Phones: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త సంవత్సరంలో సంచలనం సృష్టించనున్న ఫోన్‌లు ఇవే!

Adar Poonawalla: వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం వైపు సీరమ్ అధినేత చూపు.. ‘వాకౌ’లో 20 శాతం వాటా కొనుగోలు!

Amla Benefits: ఉసిరిని ఇలా తీసుకుంటే అద్భుతమైన రుచి.. అంతకు మించిన ఆరోగ్యం..