అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తెలుగువారు సహా ఐదుగురు భారతీయులు దుర్మరణం చెందారు. అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.. ఫన్నిన్ కౌంటీ, TX – టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ప్రకారం.. యూఎస్ ఫన్నిన్ కౌంటీలోని రాండోల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం 6.45 గంటలకు (యూఎస్ కాలమానం ప్రకారం) ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. సౌత్ బాన్‌హామ్‌కు ఆరు మైళ్ల దూరంలో రెండు వాహనాలు ఒకదానొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు సహా ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. ముగ్గురు తెలుగు వారు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు. ఇద్దరు శ్రీకాళహస్తికి చెందిన వారు కాగా.. ఒకరు గూడురుకు చెందినవారున్నారు. మృతులు గోపి తిరుమూరు, రజినేని చిరంజీవి శివ, హరితారెడ్డి డేగపూడిగా గుర్తించారు. చెన్ను సాయి తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. రాంగ్‌రూట్‌లో వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటన గురించి తెలుసుకున్న కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..