US Visa-Telugu NRI: H4, L2 వీసాల విషయంలో గందరగోళం.. తెలుగు వారికి అండగా సంతోష్‌ సోమిరెడ్డి..

|

Nov 28, 2021 | 6:33 AM

US Visa-Telugu NRI: అమెరికాలో వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు జారీ చేస్తున్న H4, L2 వీసాల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరి వీసా గడువు కూడా ముగిసింది.

US Visa-Telugu NRI: H4, L2 వీసాల విషయంలో గందరగోళం.. తెలుగు వారికి అండగా సంతోష్‌ సోమిరెడ్డి..
Us Visa
Follow us on

US Visa-Telugu NRI: అమెరికాలో వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు జారీ చేస్తున్న H4, L2 వీసాల విషయంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరి వీసా గడువు కూడా ముగిసింది. వీరిలో కొందరు కోర్టుకు వెళ్లడంతో నిబంధనలను స్వల్పంగా సడలించింది అమెరికా ప్రభుత్వం. అయితే ఈ సడలింపులు ఎవరికి ఏది వర్తిస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలోనే తెలుగువారు ఇబ్బందులు పడకూడదని H4, L2 వీసాల విషయంలో అనుమానాలను నివృత్తి చేస్తున్నారు ప్రముఖ అటార్నీ సంతోష్‌ సోమిరెడ్డి.

అమెరికా వీసా నిబంధనలలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. ఇటీవల H4, L2 వీసాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. H-1B వీసాపై అమెరికాలో పని చేస్తున్న వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు జారీ చేసే ఈ వీసాలను పునరుద్దరించకపోవడంతో చాలా మంది అక్కడ లా సూట్‌ ఫైల్‌ చేశారు. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ వీసాలను కొంత సరళీకరించింది. అయినా ఏ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి అనే విషయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే.. H4, L2 వీసాల అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పిస్తున్నారు వర్జీనియాలో సోమిరెడ్డి లా గ్రూప్‌ ద్వారా సేవలు అందిస్తున్న అటార్నీ సంతోష్‌ సోమిరెడ్డి. ఎవరికి ఏ నిబంధనలు వర్తిస్తాయో ఆయన వివరించారు. వీసాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచిస్తున్నారు అటార్నీ సంతోష్‌ సోమిరెడ్డి. ఈ విషయంలో మన తెలుగు వారికి సహకరించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామంటున్నారు.

Also read:

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?