కరోనా అప్డేట్: ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లు కోలుకున్నారు..

|

Sep 30, 2020 | 6:45 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

కరోనా అప్డేట్: ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లు కోలుకున్నారు..
Follow us on

Corona Cases In World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజు 2,88,173 పాజిటివ్ కేసులు, 5846 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33,903,122కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా1,013,726 మంది కరోనాతో మరణించారు. ఇక 25,193,262 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 7,408,066కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 210,835 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, కొలంబియా, పెరు, స్పెయిన్, మెక్సికో, దక్షిణాఫ్రికాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 6,233,700 కేసులు నమోదు కాగా.. 97,624 మంది వైరస్ కారణంగా మరణించారు.

Also Read:

మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!

ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..

ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో మరో వైరస్ టెన్షన్.!

గుడ్ న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం ధర..