High Speed Bullet Train: రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు.. ఎక్కడంటే?

|

Dec 29, 2024 | 3:56 PM

చైనా కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతుంది. తాజాగా మరో ఆవిష్కరణతో చైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలును చైనా అందుబాటులొకి తీసుకొచ్చింది. ఈ రైలు బీజింగ్‌ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణిస్తుందని చైనా రైల్వే శాఖ అధికారలు వెల్లడించారు.

1 / 6
CR450 EMU (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు) హై-స్పీడ్ రైలు నమూనాను చైనా ఇటీవల రూపొందించిన హై-స్పీడ్ బుల్లెట్ రైలు మోడల్ ఆదివారం బీజింగ్‌లో ప్రారంభమైంది. ఈ రైలు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో వెళ్తుతుంది.

2 / 6
ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై-స్పీడ్ రైలుగా మారుతుందని ఆ దేశ రైల్వే ఆపరేటర్ తెలిపారు. ఈ రైలు ప్రయాణ సమయాన్ని మరింత తగ్గిడంతో పాటు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

3 / 6
ప్రయాణీకులకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా చేస్తుందని  చైనా స్టేట్ రైల్వే గ్రూప్ కో (చైనా రైల్వే) ఆదివారం తెలిపింది. CR450 ప్రోటోటైప్ గంటకు 450 కిలోమీటర్ల పరీక్ష వేగాన్ని చేరుకుందన్నారు.

4 / 6
ఈ సందర్బంగా చైనా రైల్వే మాట్లాడుతూ.. ఈ రైలు చూడడానికి బుల్లెట్‌ షేపులో ఉంటుందని చెప్పారు. ఈ రైలు బీజింగ్‌ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణిస్తుందని వారు వెల్లడించారు.

5 / 6
ఈ రైలు లేకముందు ఇదే ప్రయాణానికి 4 గంటల సమయం పట్టేది. ఈ ట్రైన్ బరువు 10 టన్నులు ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్న సీఆర్‌400 మోడల్‌ కంటే కూడా 12 శాతం తక్కువ.

6 / 6
దీని సీఆర్‌400 మోడల్‌ కంటే విద్యుత్తు 20 శాతం తక్కువగానే వినియోగించుకుంటుంది. CR400 గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగం వెళ్తుతుంది.  చైనా ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అధునాతనమైన హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను నిర్మించింది.