Canada mass stabbing: కత్తులతో రెచ్చిపోయిన దుండగులు.. 10 మంది దారుణ హత్య.. మరో 15 మందిని..

|

Sep 05, 2022 | 11:37 AM

గుర్తు తెలియని వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరికలు సైతం జారీ చేశారు. సాస్కటూన్‌కు ఈశాన్య ప్రాంతంలోని వెల్డన్ గ్రామంలో ఆదివారం పలు ప్రదేశాలలో

Canada mass stabbing: కత్తులతో రెచ్చిపోయిన దుండగులు.. 10 మంది దారుణ హత్య.. మరో 15 మందిని..
Canada Mass Stabbing
Follow us on

Canada mass stabbing: కెనడా దేశంలో దారుణం చోటు చేసుకుంది. సాస్కట్చేవాన్ (Saskatchewan) ప్రావిన్స్‌లో పలుచోట్ల దుండగులు కత్తులతో రెచ్చిపోయారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా కెనడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గుర్తు తెలియని వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరికలు సైతం జారీ చేశారు. సాస్కటూన్‌కు ఈశాన్య ప్రాంతంలోని వెల్డన్ గ్రామంలో ఆదివారం పలు ప్రదేశాలలో కత్తిపోట్ల ఘటనలు చోటుచేసుకున్నాయని.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు కెనడా పోలీసులు వెల్లడించారు. దీంతోపాటు కత్తిపోట్ల పాల్పడినట్లుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితుల ఫొటోలను కూడా విడుదల చేశారు.

అనుమానితులను డామియన్ శాండర్సన్ (31), మైల్స్ శాండర్సన్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వారు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. దుండగులు కొంత మంది వ్యక్తులను టార్గెట్ చేసి.. 13చోట్ల కత్తులతో డాడికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..