బ్రిటన్ పార్లమెంట్ రద్దు.. ఎన్నికలకు ప్రధాని బోరిస్ రెడీ..

బ్రిటన్ లో రాజకీయ పరిణామాలు హఠాత్తుగా మారిపోయాయి. పార్లమెంటును ప్రధాని బోరిస్ జాన్సన్ రద్దు చేశారు. ఈ విషయాన్ని రాణి ఎలిజెబెత్ కు తెలియజేసేందుకు బుధవారం బకింగ్ హామ్ ప్యాలస్ కు బయల్దేరారు. ఇక డిసెంబరు 12 న జరిగే ఎన్నికలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. వెస్ట్ మిడ్ లాండ్స్ లో బోరిస్ తన కన్సర్వేటివ్ పార్టీ తరఫున ప్రచారాన్ని ప్రారంభించడానికి సిధ్దపడుతున్నారు. గత రాత్రి డౌనింగ్ స్ట్రీట్ స్టాఫ్ తో మాట్లాడిన బోరిస్.. తాను రంగం […]

బ్రిటన్ పార్లమెంట్ రద్దు.. ఎన్నికలకు ప్రధాని బోరిస్ రెడీ..
Follow us

|

Updated on: Nov 06, 2019 | 4:57 PM

బ్రిటన్ లో రాజకీయ పరిణామాలు హఠాత్తుగా మారిపోయాయి. పార్లమెంటును ప్రధాని బోరిస్ జాన్సన్ రద్దు చేశారు. ఈ విషయాన్ని రాణి ఎలిజెబెత్ కు తెలియజేసేందుకు బుధవారం బకింగ్ హామ్ ప్యాలస్ కు బయల్దేరారు. ఇక డిసెంబరు 12 న జరిగే ఎన్నికలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. వెస్ట్ మిడ్ లాండ్స్ లో బోరిస్ తన కన్సర్వేటివ్ పార్టీ తరఫున ప్రచారాన్ని ప్రారంభించడానికి సిధ్దపడుతున్నారు. గత రాత్రి డౌనింగ్ స్ట్రీట్ స్టాఫ్ తో మాట్లాడిన బోరిస్.. తాను రంగం నుంచి తప్పుకుంటున్నానని, బగిల్ (ఎన్నికల తరుణం) పిలుస్తోందని వ్యాఖ్యానించారు. అటు-లేబర్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు జెరెమీ కార్బిన్ తీరును బోరిస్ దుయ్యబట్టారు. సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ తో ఆయనను పోలుస్తూ.. లేబర్ పార్టీ అధికారంలోకి వఛ్చిన పక్షంలో.. దేశంలో పన్నులు విపరీతంగా పెరుగుతాయని, ఆ పార్టీ దేశ ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తుందని ఆరోపించారు. టోరీల ప్రచారం సందర్భంగా బోరిస్ బ్రెగ్జిట్ విషయంలో తమ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని ఓటర్లకు వివరించనున్నారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగే అంశానికి సంబంధించి ఏర్పడిన ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లోనే బోరిస్.. అదే పనిగా జనరల్ ఎలక్షన్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.