ప్రేమంటే ఇదేరా.. లవర్‌ కోసం ఎవరూ చేయని త్యాగం చేశాడు..ఆ తర్వాత ఏమైందంటే..

|

Oct 13, 2022 | 2:21 PM

అనారోగ్యంతో ఉన్న తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. దీని తరువాత అతను కుటుంబం, సమాజం గురించి పట్టించుకోకుండా ఆమె కోసం పరిమితులు దాటి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.

ప్రేమంటే ఇదేరా.. లవర్‌ కోసం ఎవరూ చేయని త్యాగం చేశాడు..ఆ తర్వాత ఏమైందంటే..
Marriage
Follow us on

ప్రేమకు సరిహద్దులు లేవంటారు..సరిగ్గా అలాంటి ఘటనే ఇది.. పాకిస్తాన్ నుండి వెలుగులోకి వచ్చిన ఇలాంటి ప్రేమకథ వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి తన ప్రియురాలి కోసం తన కాలేయాన్ని కూడా తొలగించి ఇచ్చేశాడు. అనారోగ్యంతో ఉన్న తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. దీని తరువాత అతను కుటుంబం, సమాజం గురించి పట్టించుకోకుండా ఆమె కోసం పరిమితులు దాటి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. నిజానికి ఈ సంఘటన పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరిగింది. పాకిస్థానీ యూట్యూబర్ సయ్యద్ బాసిత్ అలీ దంపతులను ఇంటర్వ్యూ చేయగా… వారు తమ కథనాన్ని పంచుకున్నప్పుడు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అబ్బాయి పేరు షాజాద్ కాగా, అతని ప్రియురాలి పేరు నైనా. ఇద్దరూ కలిసి చదువుకుని ఇప్పుడు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కొంతకాలం క్రితం, నైనా హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు పలు సూచనలు చేశారు. ఇది విని షాజాద్, నైనా చాలా బాధపడ్డారు. నైనా లివర్‌లో సమస్య ఉందని, దానిని మార్చాల్సి ఉంటుందని టెస్ట్‌ల ద్వారా బయటపడింది. లివర్‌ మార్పిడి చేయకపోతే.. నైనా ప్రాణం కూడా పోతుందన్నారు. దీంతో షాజాద్ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రేమించిన ప్రియురాలి కోసం ఎవరూ చేయని సాహసం చేశాడు. తన కాలేయాన్ని నైనాకు ఇవ్వటానికి ముందుకు వచ్చాడు..

షాజాద్‌ నిర్ణయంతో అతని కుటుంబ సభ్యులు ఏకీభవించలేదు. వద్దని వారించారు. కానీ, అతడు తన ప్రేయసి కోసం తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను ఒప్పించాడు. నైనా కోలుకున్న తర్వాత ఆ ప్రేమికులిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే షాజాద్ కుటుంబ సభ్యులు పెళ్లికి హాజరు కాలేదని తెలిసింది. కానీ, ఆ ప్రేమికులిద్దరూ మాత్రం పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు. ప్రేమకు మించినది ఏదీ లేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి