మానవాళికి ఓ వరం అనుకుని ప్లాస్టిక్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త కూడా ఊహించి ఉండరు తాను కనిపెట్టిన ప్లాస్టిక్ పర్యావరణానికి ఓ శాపంగా మారుతుందని. అవును ప్లాస్టిక్ వాడకం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు సౌకర్యంగా ఉంటె.. పర్యావరణానికి పెను సంక్షోభంగా మారింది. 2023లో 49 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ను వినియోగించారు. 2040 నాటికి ఈ సంఖ్య 765 కోట్ల టన్నులకు చేరుకోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ సంక్షోభానికి అమెరికా శాస్త్రవేత్తలు పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న వ్యర్థాలను తొలగించే ప్లాస్టిక్‌ను రూపొందించారు. దీనికి బయోప్లాస్టిక్ అని పేరు పెట్టారు. ఈ ప్లాస్టిక్ తయారీలో బ్యాక్టీరియాను ఉపయోగించారు. ఇది ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్‌కు మంచి ప్రత్యామ్నాయం కాగలదని, వ్యర్థాల సమస్యకు పరిష్కారంగా మారుతుందని పేర్కొంటున్నారు. ఈ బయోప్లాస్టిక్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం
ఈ ప్రత్యేకమైన బయోప్లాస్టిక్‌ను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో సిద్ధం చేసింది. ఇది బయోప్లాస్టిక్ ఒక రకమైన థర్మోప్లాస్టిక్ పాలియురేతేన్ (TPU).. ఇది చాలా ఈజీగా సహజంగా నాశనం అవుతుంది. విశేషమేమిటంటే ఇలా క్షీణించడానికి బాక్టీరియా వాడతారు. దాని పేరు బాసిల్లస్ సబ్టిలిస్.
బాసిల్లస్ సబ్‌టిలిస్ అనే జాతి ఈ బయో ప్లాస్టిక్‌లో ఉంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిసినప్పుడు ఈ బ్యాక్టీరియా చురుకుగా మారి దానిని నాశనం చేయడం ప్రారంభిస్తుంది. అంటే, సాధారణ ప్లాస్టిక్‌తో పోలిస్తే ఈ బయోప్లాస్టిక్ నీరు, నేల మొదలైన వాటితో కలిసినప్పుడు నెమ్మదిగా నాశనం కావడం ప్రారంభమవుతుంది.
పాలియాసిటిక్ యాసిడ్ సాధారణంగా సేంద్రీయ, సులభంగా అధోకరణం చెందగల ప్లాస్టిక్ తయారీలో ఉపయోగిస్తున్నారు. దీని నుండి తయారైన పదార్థాలు కప్పులు, ప్లేట్లు, సీసాలు మొదలైన ప్యాకేజింగ్ మెటీరియల్‌కు సంబంధించిన ఉత్పత్తుల తయారీలో ఉపయోగించబడతాయి.
సమస్య ఏమిటంటే ప్లాస్టిక్ వాడకం కాదు.. నాశనం అవ్వకపోవడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్ నీరు, భూమిలో చాలా కాలం పాటు ఉండి చుట్టూ ఉన్న పర్యావరణాన్ని నాశనం చేస్తూనే ఉంటుంది. ఉత్పత్తి చేయబడిన మొత్తం ప్లాస్టిక్‌లో 12% మాత్రమే కాలిపోతుంది. 9% రీసైకిల్ చేయబడుతుంది.
పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా ప్రకృతిలోకి వచ్చి ప్రకృతికి హాని కలిగిస్తున్నాయి. 2040 సంవత్సరం నాటికి ప్రతి సంవత్సరం 290 మిలియన్ టన్నుల చెత్త ప్రపంచంలోని మహాసముద్రాలు, నదులు, చెరువులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
బయోప్లాస్టిక్‌లో ఉపయోగించే పదార్థాలలో చెరకు, మొక్కజొన్న కూడా ఉన్నాయి. వీటి వినియోగంతో రోజురోజుకూ చెరకు, మొక్కజోన్నకు డిమాండ్ పెరుగుతుంది. వీటి సాగుకు స్థలం కల్పించేందుకు అడవుల నరికివేత ఎక్కువ అవుతుంది. అడవులను నరికివేయడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని వదిలించుకోవడానికి ఇది చాలా సహాయకారిగా ఉంటుందని నిరూపించవచ్చు. ఐయితే ఈ బయో ప్లాస్టిక్ తయారీలో కూడా కొన్ని సవాళ్లు తలెత్తవచ్చు. అడవుల నరికివేత, ఆహార పదార్థాల కొరత వంటివి. అయితే శాస్త్రవేత్తలు ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని హ్యూమన్ ఇంటరెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..