బల్గేరియన్ కి చెందిన ప్రముఖ అంధ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా 2025 సంవత్సరానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన అంచనాలు చేసారు. విప్లవాత్మక వైద్య ఆవిష్కరణల నుంచి గ్రహాంతరవాసుల ఎన్‌కౌంటర్ల వరకు ఈ అంచనాలలో ఉన్నాయి. అయితే అందరి దృష్టి ఈ అంచనాపైనే ఉంది. ఎందుకంటే ఆమె చెప్పిన అమెరికాలో అల్‌ఖైదా ఉగ్రవాదుల 9/11 దాడులు, బ్రెగ్జిట్ సహా అనేక సంఘటనలు నిజం అయ్యాయి. ఈ నేపధ్యంలో కొత్త ఏడాదిపై బాబా వంగా అంచనాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు.
వైద్యశాస్త్రంలో పురోగతి: బాబా వంగా అంచనాల ప్రకారం, ప్రయోగశాలలో మానవ అవయవాలను పెంచే ప్రక్రియ చివరికి పరిపూర్ణమవుతుంది. ఈ సంచలనాత్మక ఆవిష్కరణ ద్వారా మిలియన్ల మంది జీవిత కాలం పొడిగించబడుతుంది. అవయవాల మార్పిడి సులభంగా చేస్తారు. అంతేకాదు మానవాళి ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక మొండి వ్యాధులకు అంటే క్యాన్సర్ వంటి చికిత్సలో గణనీయమైన పురోగతి ఉంటుందని అంచనా వేసింది. పలు రకాల ఔషదాలు అందుబాటులోకి వస్తాయి.
ఎలియెన్స్‌తో ఎన్‌కౌంటర్: కొత్త సంవత్సరంలో మానవులకు గ్రహాంతర వాసులకు మధ్య సంబంధం ఏర్పడవచ్చు. దీంతో ప్రపంచంలో అశాంతి నెలకొంటుంది. వినాశనానికి దారి తీయవచ్చు.
యూరోపియన్ యుద్ధం: బాబా వంగా 2025 ఏడాదికో జరగనున్న అంచనాలలో ఒకటి యూరోప్ విపత్తు ఒకటి. పశ్చిమ, తూర్పు దేశాల మధ్య భారీ యుద్ధం జరగొచ్చు..తూర్పులో మొదలయ్యే యుద్ధం పశ్చిమాన్ని నాశనం చేస్తుంది. అంతేకాదు పాత మిత్రులను పక్కనబెట్టి కొత్త వారితో చేసే స్నేనం వలన ప్రపంచనాయకత్వంలో మార్పులు వస్తాయని.. దీంతో అంతర్జాతీయ సంబంధాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని బాబా వంగా చెప్పింది.
హ్యూమన్ టెలిపతి: మానవులు ఒకరి మెదడుతో ఒకరు మాట్లాడుకుంటారని .. శాస్త్రజ్ఞులు మానవ మేథస్సుకు సంబంధించిన రహస్యాలని కనుగొంటారని ఇది కొత్త ఏడాదిలో విప్లవాత్మకమైన మార్పు అని అంచనా వేశారు.
వాతావరణంలో మార్పులు: వాతావరణంలో మార్పులు, యుద్ధాలు వంటి కారణాల వలన భూమికి పెను ముప్పు ఏర్పడనుందని.. సమస్త మానవాళి వరదలు, తుఫాన్లు, హరికేస్లు, సునామీలు సహా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలతో అనేక ఇబ్బందులు పడతారని బాబా వంగా అంచనా వేసింది.
మూడవ ప్రపంచ యుద్ధం: ఇంకా బాబా వంగా మూడవ ప్రపంచ యుద్ధం గురించి కూడా చెప్పారు. ప్రధాన దేశాల మధ్య జరిగే యుద్ధం వలన భారీగా జీవులు మరణిస్తారని, పెను విధ్వంసం జరుగుతుంది.. అశాంతికి కారణమవుతుంది. ఇది 2025లో ప్రారంభమవుతుంది. యుఎస్ ,యు చైనాల మధ్య అసమ్మతితో వివాదం చెలరేగుతుందని ఆమె స్పష్టం చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..