Iphones: యాపిల్‌కు వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కిన చైనా విద్యార్థులు.. ఎందుకంటే..

|

Oct 29, 2021 | 11:36 AM

ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ యాపిల్‌కు వ్యతిరేకంగా చైనా యూనివర్సిటీ విద్యార్థులు కోర్టు మెట్లెక్కారు. ఆ సంస్థ నుంచి విడుదలైన ఐఫోన్‌ 12 ఫ్రో..

Iphones: యాపిల్‌కు వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కిన చైనా విద్యార్థులు.. ఎందుకంటే..
Follow us on

ప్రముఖ టెక్‌ దిగ్గజ సంస్థ యాపిల్‌కు వ్యతిరేకంగా చైనా యూనివర్సిటీ విద్యార్థులు కోర్టు మెట్లెక్కారు. ఆ సంస్థ నుంచి విడుదలైన ఐఫోన్‌ 12 ఫ్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జర్‌ ఇవ్వనందుకుగాను బీజింగ్‌ కోర్టులో దావా వేశారు. ఐ ఫోన్‌ కొన్నవారికి ఆ సంస్థ అందించిన యూఎస్‌బీ టైప్‌-సి ఛార్జింగ్‌ కేబుల్‌ ఇతర ఛార్జర్లకు ఏ మాత్రం అనుకూలంగా లేదని ఈ సందర్భంగా విద్యార్థులు పేర్కొన్నారు. ఫోన్‌ విడుదలకు ముందు తమ కేబుల్‌ ఛార్జర్‌ అన్ని కంపెనీల ఛార్జర్లకు సపోర్ట్‌ ఇస్తుందని చెప్పి కొనుగోలు దారులను మోసం చేశారని స్టూడెంట్స్‌ తెలిపారు.

వారు ఇస్తున్నప్పుడు..మీరెందుకు ఇవ్వరు..
కర్బన్‌ వెస్ట్‌ రిడక్షన్‌ను తగ్గించేందుకు గాను ఇటీవల పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఛార్జర్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాకుతోనే యాపిల్‌ కంపెనీ తమను మోసం చేసిందని విద్యార్థులు వాపోతున్నారు. ‘చైనాలోని పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు అడాప్షన్‌ ఆప్షన్‌ను ఇస్తున్నాయి. కానీ కర్బన్‌ వెస్ట్‌ రిడక్షన్‌ అనే సాకును ఉపయోగించుకుని యాపిల్‌ మొబైల్‌ కొనుగోలు దారులకు ఛార్జర్లను నిలిపివేసింది. వైర్‌లెస్‌ ఛార్జర్లను ప్రోత్సహించడానికే ఆ సంస్థ ఇలా చేస్తోంది. తమకు వెంటనే ఛార్జర్లను అందజేసేలా యాపిల్‌ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నష్టపరిహారం కింద 100 యువాన్లు చెల్లించాలి’ అని ఈ సందర్భంగా విద్యార్థులు కోర్టుకు నివేదించారు.

Also Read:

Covaxin: అక్కడకు వెళ్లే భారతీయులకు శుభవార్త..కొవాగ్జిన్‌కు ఆమోదం..ఆంక్షల తొలగింపు..

ఆ నగరంలో ఇళ్లు కట్టుకోవడానికి ఉచిత భూమి.. వీడియో

Weight Loss: సోషల్‌ మీడియా ఖాతాలను తొలగించింది.. 32 కిలోలు తగ్గింది.. ఎలాగంటే..