Airlines Emergency Landing: ప్రయాణికురాలి తలలో పాకుతూ కలినిపించిన పేలు.. కంగారుగా ఫ్లైట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

|

Aug 06, 2024 | 11:50 AM

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. లాస్ ఏంజిల్స్ నుంచి న్యూయార్క్ వెళ్లవల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఫీనిక్స్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. సాధారణంగా సాంకేతిక సమస్యలు రావడమో, వాతావరణ ప్రతికూలత వల్లనో.. లేదా ప్రయాణికులు ఎవరైనా అనారోగ్యానికి గురైతేనో విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుంటారు. కానీ ఓ మహిళా ప్రయాణికురాలి తల్లో కనిపించిన..

Airlines Emergency Landing: ప్రయాణికురాలి తలలో పాకుతూ కలినిపించిన పేలు.. కంగారుగా ఫ్లైట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!
American Airlines
Follow us on

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. లాస్ ఏంజిల్స్ నుంచి న్యూయార్క్ వెళ్లవల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఫీనిక్స్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. సాధారణంగా సాంకేతిక సమస్యలు రావడమో, వాతావరణ ప్రతికూలత వల్లనో.. లేదా ప్రయాణికులు ఎవరైనా అనారోగ్యానికి గురైతేనో విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుంటారు. కానీ ఓ మహిళా ప్రయాణికురాలి తల్లో కనిపించిన పేలు వల్ల విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేశారు. ఈ ఘటన జూన్‌లో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాల్లో ఉండగా. ఓ మహిళ తలలో పేలు పాకుతుండటాన్ని చూసిన ఇద్దరు ప్రయాణికులు వెంటనే ఫ్లైట్‌ అటెండెంట్‌కు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది విమానాన్ని ఫీనిక్స్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే ఈ విషయమై ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా హఠాత్తుగా విమానాన్ని ల్యాండ్‌ చేశారని, దాదాపు 12 గంటల ఆలస్యం తర్వాత గమ్యస్థాలకు చేరుకున్నామని.. తనకు కలిగిన అసౌకర్యాన్ని ఎథాన్ జుడెల్సన్ అనే ప్రయాణికుడు ‘టిక్‌టాక్’ వీడియో ద్వారా పంచుకున్నాడు. తాను చుట్టూ చూశానని, కానీ ఎవరూ భయపడం లేదని తెలిపాడు. విమానం ల్యాండ్‌ అయ్యాక ఓ మహిళను తీసుకెళ్లారని తెలిపాడు. దీంతో ప్రయాణికుల్లో అయోమయం నెలకొంది. ఆ తర్వాత విమానం ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయిందని తోటి ప్రయాణికుడిని అడిగడంతో అసలు విషయం తెలిసిందని తెలిపాడు.

ఫీనిక్స్‌లో దిగిన వెంటనే ప్రయాణికులందరికీ వోచర్లు అందించారు. అందరినీ హోటల్‌ గదులకు తరలించారు. ఆ తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసినట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ తర్వాత ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.