Air India Flight: ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. కెనడాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

|

Oct 15, 2024 | 6:55 PM

నిర్ణీత భద్రతా ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని, విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను తనిఖీ చేస్తున్నామని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు సహాయం చేసేందుకు విమానాశ్రయంలో ఏజెన్సీలను సక్రియం చేశారు. ఎయిర్ ఇండియా సహా ఇతర విమానయాన సంస్థలకు ఇటీవలి కాలంలో అనేక బాంబ్ బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. అయితే విచారణలో ఇవన్నీ పుకార్లుగా తెలిశాయి.

Air India Flight: ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. కెనడాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Air India Flight Bomb Threat
Follow us on

దేశీయంగా నే కాదు విదేశాలకు వెళ్తున్న విమానాలకు వరసగా బాంబు బెదిరింపు హెచ్చరికలు వస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని కెనడాలోని ఇకల్యూట్ విమానాశ్రయానికి మళ్లించారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఆల్127 విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ముందుజాగ్రత్తగా విమానాన్ని కెనడాలోని ఇకల్యూట్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

నిర్ణీత భద్రతా ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని, విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులను తనిఖీ చేస్తున్నామని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు సహాయం చేసేందుకు విమానాశ్రయంలో ఏజెన్సీలను సక్రియం చేశారు. ఎయిర్ ఇండియా సహా ఇతర విమానయాన సంస్థలకు ఇటీవలి కాలంలో అనేక బాంబ్ బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. అయితే విచారణలో ఇవన్నీ పుకార్లుగా తెలిశాయి.

ఇవి కూడా చదవండి

అధికారులతో టచ్‌లో ఉన్నాం

బాధ్యతాయుతమైన ఎయిర్‌లైన్ ఆపరేటర్‌గా బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమించమని కోరింది. ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ఎయిర్ ఇండియా అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని.. తద్వారా ప్రయాణీకులకు కలిగిన ఇబ్బందులను, అసౌకర్యానికి ఇలా బెదిరించిన వారు బాధ్యత వహించేలా చూస్తామని చెప్పారు. అంతేకాదు విమానయాన సంస్థకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు.

బోయింగ్ 737-మ్యాక్స్ 8లో బాంబు పెట్టే ప్రమాదం

దీంతో పాటు మరో ఘటనలో మంగళవారం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విమానంలో (బోయింగ్ 737-మాక్స్ 8) 132 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం జైపూర్ నుంచి బయలు దేరగా.. అధికారుల ఆదేశాల మేరకు విమానాన్ని ఎమర్జెన్సి గా అయోధ్యలోని మహర్షి వాల్మీకి విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అధికారులు విమానంలో తనిఖీలు నిర్వహించారు.

సోషల్ మీడియా ఖాతా నుంచి తమకు బెదిరింపు వచ్చిందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. దీనిపై వెంటనే సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను సక్రియం చేశారు. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విచారణ అనంతరం విమానానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..