Latest Crime News: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. వాహనంతో తొక్కించి మహిళ హత్య.. ఎందుకు చేశాడో తెలుసా..

Latest Crime News: బంధువుల మధ్య నెలకొన్న ఓ పొలం వివాదం ఓ మహిళ ఉసురు తీసింది. డబ్బుల కోసం సమీప బంధువే ఓ కుటుంబాన్ని

Latest Crime News: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. వాహనంతో తొక్కించి మహిళ హత్య.. ఎందుకు చేశాడో తెలుసా..
Follow us

|

Updated on: Jan 11, 2021 | 7:24 AM

Latest Crime News: బంధువుల మధ్య నెలకొన్న ఓ పొలం వివాదం ఓ మహిళ ఉసురు తీసింది. డబ్బుల కోసం సమీప బంధువే ఓ కుటుంబాన్ని హత్య చేయాలని ప్రయత్నించాడు. బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను వాహనంతో వెనక నుంచి ఢీకొట్టి ఓ మహిళ మృతికి కారణమయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బాలానగర్‌ మండలం మాచారం గ్రామానికి చెందిన యాదయ్య ప్రస్తుతం షాద్‌నగర్‌లో ఉంటున్నారు. యాదయ్య తల్లి, ఆమె ముగ్గురు చెల్లెళ్లకు కలిపి జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో ఎకరం ఎనిమిది గుంటల పొలం ఉంది. దీన్ని ఆర్నెల్ల కిందట యాదయ్య రూ.80 లక్షలకు విక్రయించారు. అందులో తమ వాటా డబ్బు ఇవ్వాలని చిన్నమ్మ కుమారులు అడిగినా ఎవరికీ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం యాదయ్య తన భార్య శైలజ, కుమార్తె నిహారికతో కలిసి బైక్‌పై నవాబ్‌పేట మండలం కారుకొండలో బంధువుల శుభకార్యానికి వెళ్లారు.

సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి షాద్‌నగర్‌ బయలుదేరారు. ఇది గమనించిన యాదయ్య చిన్నమ్మ కుమారుడు మహబూబ్‌నగర్‌లోని ఏనుగొండలో నివాసముంటున్న నర్సింహులు వాహనంతో వెంబడించి నుంచి వచ్చి యాదయ్య ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ముగ్గురూ కింద పడిపోయారు. వెంటనే తేరుకొన్న యాదయ్య లేచి కొంతదూరం పరుగులు తీశారు. కింద పడిపోయిన ఆయన భార్య శైలజ పైకి లేచేందుకు ప్రయత్నిస్తుండగా నర్సింహులు తన వాహనాన్ని మళ్లీ వెనక్కు పోనిచ్చి రెండోసారి ఢీకొట్టాడు. తిరిగి ఆమె కింద పడిపోవడంతో వాహనాన్ని శైలజ పైకి ఎక్కించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. అనంతరం నిందితుడు తన వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. వెంటనే స్థానికులు గాయపడిన యాదయ్య, నిహారికలను షాద్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కూలీ డబ్బుల కోసం ఇద్దరి మధ్య గొడవ.. రూ.500 కోసం సెల్‌ఛార్జింగ్‌ వైర్‌తో యువకుడి హత్య.. ఛేదించిన గుంటూరు పోలీసులు

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్