Breaking News
 • నిజామాబాద్‌లో హైఅలర్ట్. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిన్న ఒక్క రోజే 26 కేసులు. పాజిటివ్‌ వచ్చినవారి బంధువులను గుర్తించే పనిలో అధికారులు.
 • ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 కేసులు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో 144 సెక్షన్‌. పాజిటివ్‌ ప్రాంతాల్లోని వాసులకు హోంక్వారంటైన్‌. రక్త నమూనాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ.
 • గుజరాత్: సురేంద్రనగర్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి, మరొకరికి గాయాలు. హైదరాబాద్-70, వరంగల్‌ అర్బన్-19, కరీంనగర్-17 కేసులు. మేడ్చల్-15, రంగారెడ్డి-16, నిజామాబాద్-16, నల్గొండ-9. కామారెడ్డి-8, మహబూబ్‌నగర్-7, గద్వాల-6, సంగారెడ్డి-6. మెదక్-4, భద్రాద్రి-కొత్తగూడెం-4 కేసులు. ములుగు-2, భూపాలపల్లి-1, జనగామ-1 కేసులు నమోదు.
 • రాజస్థాన్: ఈరోజు కొత్తగా 12 పాజిటివ్‌ కేసులు నమోదు. మొత్తం 191 కేసులు నమోదు.
 • ఏపీ, తెలంగాణలో రేషన్‌ పరేషాన్. రేషన్‌ షాప్‌ల దగ్గర భారీగా క్యూ కట్టిన జనం. మెజారిటీ షాప్‌ల దగ్గర కనిపంచిన భౌతికదూరం నిబంధన. పంపిణీలో జాప్యంపై నిర్వాహకులతో జనం ఘర్షణ. రంగంలోకి దిగిన పోలీసులు. రేషన్‌ షాప్‌ల దగ్గర భౌతిక దూరం పాటించేలా చర్యలు. కార్డు దారులందరికీ ఉచిత బియ్యం అందిస్తామంటున్న అధికారులు.

‘వాటర్ బెల్’ క్యాంపెయిన్.. ఎందుకు అవసరం..?

Water Bell campaign to benefit children to drink, ‘వాటర్ బెల్’ క్యాంపెయిన్.. ఎందుకు అవసరం..?

‘వాటర్‌ బెల్’ ఈ కార్యక్రమం.. ప్రస్తుతం అన్ని స్కూళ్లలోనూ జోరందుకుంటోంది. స్కూళ్లల్లో.. సరైన నీరు తాగని కారణంగా.. స్టూడెంట్స్ ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూంటారు. మరీ వీక్‌గా ఉన్న పిల్లలు.. కళ్లు తిరిగి పడిపోతూంటారు. ముఖ్యంగా ఈ సమస్య వేసవిలో అధికంగా ఉంటుంది. దీంతో.. ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా.. కేరళ రాష్ట్రం ఓ సరికొత్త మార్గాన్ని పాటిస్తోంది. ఆ రాష్ట్రంలోని ఉన్న అన్ని స్కూళ్లలో.. ప్రతీ 3 గంటలకొకసారి.. ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో.. స్టూడెంట్స్ నీరు తాగేలా.. టీచర్స్‌ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారు. ఇప్పుడు ఇదికాస్తా.. సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యింది. అన్ని రాష్ట్రాలు ప్రస్తుతం ఈ కార్యక్రమంపై దృష్టి పెడుతున్నారు.

ఈ ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని తమిళనాడులోని పాఠశాలల్లో కూడా పాటిస్తున్నారు. ప్రతీ పిరియడ్‌కు మధ్య పది నిమిషాల సమయం కేటాయిస్తున్నట్లు.. తమిళనాడు విద్యాశాఖ మంత్రి కేఏ సెంగొట్టయాన్ ప్రకటించారు. అలాగే.. ఇప్పుడు ఈ ‘వాటర్ బెల్‌’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని అన్ని స్కూళ్లల్లోనూ.. ప్రతిస్టాత్మకంగా.. తీసుకురావాలని అధికారులు ఆలోచిస్తున్నారట. గవర్నమెంట్ స్కూళ్లతో పాటు.. అన్ని ప్రైవేటు స్కూళ్లల్లో దీన్ని అవలంభించాలని.. విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రోజుకు కనీసం.. 3 నుంచి 4 సార్లు అయినా.. ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.

Water Bell campaign to benefit children to drink, ‘వాటర్ బెల్’ క్యాంపెయిన్.. ఎందుకు అవసరం..?

విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎందుకు అవసరం..?

 • ‘వాటర్ బెల్’ కార్యక్రమం ద్వారా.. ముఖ్యంగా విద్యార్థులు.. డీ హైడ్రేషన్‌కి గురి కాకుండా ఉంటారు.
 • అంతేకాకుండా.. ఈ పదినిమిషాల బ్రేక్ ద్వారా విద్యార్థులకు కాస్త ఒత్తిడిని తగ్గించవచ్చు.
 • చదువుపై ధ్యాస పెట్టేలా కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
 • అలాగే.. స్టూడెంట్స్‌కి కాస్త ఉపశమనం లభించినట్టు కూడా ఉంటుంది.
 • నీరు తాగిన కారణంగా.. పిల్లల్లో రక్తప్రసరణ చురుగ్గా జరుగుతుంది.
 • జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది.
 • రోజూ ఇలా నీరు త్రాగడం వలన… అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.

 

Related Tags