ఉద్యమిస్తోన్న వీఆర్‌వో, వీఆర్‌ఏలు

VRO and VRAs are Protestin In Achempaeta, ఉద్యమిస్తోన్న వీఆర్‌వో, వీఆర్‌ఏలు
నారాయణపేట జిల్లా కేంద్రంలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు రోడ్డేక్కారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను ఇతర శాఖలో కలపవద్దని  కోరుతూ  పలువురు వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు బుధవారం స్థానిక తహశిల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు ఎన్నో యేండ్లుగా రెవెన్యూ శాఖ కింద పనిచేస్తున్నారని, ఆ శాఖను వేరే శాఖలో విలీనం చేస్తామనే ప్రభుత్వ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఓల సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్‌, మండల వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.
అటు అచ్చంపేట మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం ముందు వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని తమ నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థ రద్దు ను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్. రెవెన్యూ వ్యవస్థ రక్షణకై పోరాడుదాం అంటూ తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు విఆర్ఓ..విఆర్ఏ లు  తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు…అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు..ఈ కార్యక్రమంలో వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు ధర్నాలో పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని జన్నారంలో  వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను ఇతర శాఖలో కలపవద్దని కోరుతూ  పలువురు వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు స్థానిక తహశిల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
VRO and VRAs are Protestin In Achempaeta, ఉద్యమిస్తోన్న వీఆర్‌వో, వీఆర్‌ఏలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *