ఎన్నికలల్లో ఇచ్చిన డబ్బు పోయిందంటూ యువకుడి హంగామా!
ఎన్నికల వేళ ఓట్ల వేటలో రాజకీయ నాయకులు పంచే డబ్బులు ఒక్కోసారి ఊహించని వింతలకు దారితీస్తుంటాయి. తాజాగా జోగిపేటలో ఓ యువకుడు తనకు అందిన 'ఎన్నికల నగదు' పోయిందని ఏకంగా సెల్ టవర్ ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. శనివారం ఉదయం జరిగిన ఈ హైడ్రామా స్థానికంగా పెద్ద కలకలమే రేపింది.
జోగిపేటకు చెందిన మక్కల అశోక్ అనే యువకుడికి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక వార్డు కౌన్సిలర్ శుక్రవారం రాత్రి 4,000 రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బుతో కొత్త సెల్ ఫోన్ కొనాలని అశోక్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే, శనివారం ఉదయం నిద్రలేచి చూసేసరికి తన జేబులో ఉండాల్సిన ఆ డబ్బు కనిపించలేదు. ఎవరో తన ఇంట్లోకి వచ్చి ఆ నగదు ఎత్తుకెళ్లారని భావించిన అశోక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పోయిన డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ అశోక్ నేరుగా సమీపంలోని సెల్ టవర్ ఎక్కాడు. పైనుంచి దూకేస్తానని బెదిరిస్తూ హల్‌చల్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అశోక్ భార్య పోచమ్మ మరియు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. “దిగిరా.. ఆ డబ్బులు మేమే ఇస్తాం” అని వారు బతిమిలాడటంతో అశోక్ శాంతించి కిందకు దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :