చర్చలు విఫలం.. కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు .!

Updated on: Apr 14, 2026 | 10:55 AM

ప్రపంచం మరో మహా యుద్ధం ముంగిట నిలబడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా - ఇరాన్ మధ్య జరిగిన కీలక చర్చలు విఫలం కావడంతో, గల్ఫ్ రీజియన్‌లో యుద్ధ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశాన్ని ఆర్థికంగా, సైనికంగా దెబ్బతీసేందుకు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నేవీకి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌కు టోల్ చెల్లించి వెళ్లే ఏ నౌకనైనా అంతర్జాతీయ జలాల్లో అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ఇరాన్ చేతిలో అణుశక్తి ఉండటం ప్రపంచానికే ప్రమాదకరమని, ఇచ్చిన మాటను ఇరాన్‌ నిలబెట్టుకోలేదని ట్రంప్ మండిపడ్డారు. హర్మూజ్‌లో ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్స్‌ను ధ్వంసం చేస్తామని, ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే నిర్వీర్యం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల్లో అమెరికా ప్రధానంగా మూడు డిమాండ్లను ఇరాన్ ముందు ఉంచింది. యురేనియం శుద్ధిని తక్షణమే నిలిపివేయాలని, నౌకల రాకపోకల కోసం జలసంధిని పూర్తిగా తెరవాలని, హెజ్బొల్లా, హమాస్ వంటి సంస్థలకు ఫండింగ్ ఆపాలని మూడు డిమాండ్లను ప్రతిపాదించింది. అయితే, శాంతి కోసమే తాము యురేనియం శుద్ధి చేస్తున్నామని చెబుతూ ఇరాన్ ఈ డిమాండ్లను తిరస్కరించింది. దీంతో చర్చలు విఫలమైనట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధికారికంగా ప్రకటించారు.

మరిన్ని వీడియోల కోసం :

ఆహా అనిపిస్తున్న పోచమ్మ ట్రైలర్‌!

ఎన్టీఆర్ బీస్ట్ మోడ్.. కొత్త లుక్‌తో తారక్ సర్‌ప్రైజ్

షారుఖ్‌ ప్లేస్‌ని రణ్‌వీర్‌ కొట్టేస్తారా?

కోలీవుడ్‌లో సీక్వెల్స్‌ జోరు

 

Follow Us