Israel – Gaza: గాజాను ఇక వదిలేయండి! ఇజ్రాయెల్‌కు అమెరికా వార్నింగ్.? గాజా ‘స్వాధీనం’ మంచిది కాదు.
హమాస్ నెట్‌వర్క్‌ను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. గాజా చుట్టూ ఉచ్చు బలంగా బిగిస్తోంది. గాజాలోని కీలక ప్రాంతంలోకి ఐడీఎఫ్ దళాలు అడుగుపెట్టాయి. మరోవైపు, హమాస్‌ను పూర్తిగా అంతమొందించేదాకా ఈ యుద్ధం ఆగబోదని తేల్చిచెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. యుద్ధం ముగిశాక గాజా భద్రతా బాధ్యతలను తామే తీసుకుంటామని ప్రకటించారు.
హమాస్ నెట్‌వర్క్‌ను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. గాజా చుట్టూ ఉచ్చు బలంగా బిగిస్తోంది. గాజాలోని కీలక ప్రాంతంలోకి ఐడీఎఫ్ దళాలు అడుగుపెట్టాయి. మరోవైపు, హమాస్‌ను పూర్తిగా అంతమొందించేదాకా ఈ యుద్ధం ఆగబోదని తేల్చిచెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. యుద్ధం ముగిశాక గాజా భద్రతా బాధ్యతలను తామే తీసుకుంటామని ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా వ్యతిరేకించినట్లు కన్పిస్తోంది. గాజాను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఇజ్రాయెల్‌కు అంత మంచిది కాదంటూ హెచ్చరించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. గాజాను తిరిగి ఆక్రమించడం అనేది ఇజ్రాయెల్‌కు, ఆ దేశ ప్రజలకు అంత మంచిది కాదని అధ్యక్షుడు జో బైడెన్ విశ్వసిస్తున్నట్లు వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బి చెప్పినట్లు కథనం తెలిపింది. యుద్ధం తర్వాత గాజా పరిస్థితి ఎలా ఉండబోతుంది? గాజాలో ఏ ప్రభుత్వం ఉంటుంది? అనే దానిపై ఇటీవల విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ ప్రాంతంలోని కొన్ని దేశాలతో చర్చించారు. ఈ ఉద్రిక్తతలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యుద్ధం మధ్యలో మానవతా సాయానికి స్వల్ప విరామాలు ఇస్తామని ప్రకటించిన ఆయన.. కాల్పుల విరమణను పాటించే ప్రసక్తే లేదన్నారు. అంతేగాక.. ఈ యుద్ధం తామే గెలుస్తామని విశ్వాసం ప్రకటించిన నెతన్యాహు.. యుద్ధం తర్వాత నిరవధికంగా గాజాలో భద్రతా బాధ్యతను తామే చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో గాజాను మళ్లీ ఇజ్రాయెల్ తమ అధీనంలోకి తీసుకోనుందని స్పష్టమవుతోంది. 2007 ముందు వరకు గాజా ఇజ్రాయెల్ అధీనంలోనే ఉండేది. ఆ తర్వాత హమాస్ దాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హమాస్ మిలిటెంట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఉత్తర గాజాను ఇజ్రాయెల్ సైనిక దళాలు చుట్టుముట్టాయి. మిలిటెంట్లు ఉండే ఆవరణను అధీనంలోకి తీసుకున్నట్లు తెలిపాయి. భూగర్భ సొరంగాల్లో నక్కిన మిలిటెంట్లపై దాడులకు ఐడీఎఫ్ సిద్ధమైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.