వెనిజులా అధ్యక్షుడిని కబ్జా చేసిన అమెరికా వీడియో

Updated on: Jan 04, 2026 | 6:05 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో వెనిజులా అధ్యక్షుడిని అమెరికా అదుపులోకి తీసుకుందని ప్రచారం జరిగింది. నికోలస్ మదురో, ఆయన భార్యపై డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం సైనిక చర్య కాదని, న్యాయ వ్యవస్థ పేరుతో చేసిన రాజకీయ దాడని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అమెరికా వెనిజులాలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని చూస్తోంది.

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నియంత్రణలోకి తీసుకుందని, మదూరో దంపతులు అమెరికా జైల్లో మగ్గాల్సి వస్తుందని వచ్చిన ప్రకటన ప్రపంచ రాజకీయాల్లో షాక్ సృష్టించింది. జనవరి 3న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెనిజులాపై పెద్ద ఎత్తున దాడి చేశామని, అధ్యక్షుడు మదురోను పట్టుకున్నామని ప్రకటించారు. ఇది డ్రగ్స్ పై యుద్ధంగా ప్రారంభమై, ఇప్పుడు ఒక దేశాధ్యక్షుడి అరెస్టు స్థాయికి చేరుకుంది.

మరిన్ని వీడియోల కోసం :

ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో

ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో

బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో

న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో