House Burning Video: ఇదేం వెర్రి నాయనా.. కళ్ల ముందే ఇల్లు కాలిపోతుంటే.. నవ్వుతూ లైవ్ షో..!(వీడియో)
ఓ వైపు తన ఇల్లు మంటల్లో కాలిపోతుంటే ఫేస్‌బుక్‌లో లైవ్ షో పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. అమెరికాలోని సౌత్ కరోలినాలో జరిగింది ఈ ఘటన.. ఈ వ్యక్తి పేరు సామీ స్మిత్. సామీ వృత్తి రీత్యా మత బోధకుడు. ప్రజలకు మతానికి సంబంధించిన ప్రచార బోధనలు చేస్తుంటాడు...
ఓ వైపు తన ఇల్లు మంటల్లో కాలిపోతుంటే ఫేస్‌బుక్‌లో లైవ్ షో పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. అమెరికాలోని సౌత్ కరోలినాలో జరిగింది ఈ ఘటన.. ఈ వ్యక్తి పేరు సామీ స్మిత్. సామీ వృత్తి రీత్యా మత బోధకుడు. ప్రజలకు మతానికి సంబంధించిన ప్రచార బోధనలు చేస్తుంటాడు… స్మిత్ అనే వ్యక్తి తన కాలిపోతున్న ఇంటిని కాల్చడమే కాకుండా, ప్రజలకు చూపించడానికి ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. వీడియోలో సామీ తన ఇల్లు కాలిపోతున్నట్లు చెప్పడం విశేషం.
పైగా ఫేస్‌బుక్ లైవ్‌లో సామీ….. నా ఇల్లు కాలిపోతోంది. తన కూతురు బెడ్ రూం పూర్తి కాలిపోయిందంటూ.. లైవ్ కామెంట్రీ చేశాడు. కళ్ల ముందే తన ఇల్లు కాలి బూడిదైపోతున్నా.. నవ్వుతూ ఇదంతా ఫేస్ బుక్ లైవ్ లో చెప్పుకొచ్చాడు. అయితే, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించి సమాచారం లేదు. ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో, సామీ ఇంట్లో మంటలు చెలరేగడంతో, అతని ఇరుగుపొరుగు వారు వెంటనే సహాయం కోసం పరిగెత్తారు. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి, వారు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..